మెగాస్టార్ చిరంజీవికి ఏదో అయింది.. వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలతో నెట్టింట్లో ట్రోల్ అవ్వడమే పనిగా పెట్టుకున్నారు.. తాతను కించ పరిచేలా వ్యాఖ్యలు.. వారసత్వం గురించి కాంట్రవర్సీ మాటలు.. రాజకీయాలకు శాశ్వతంగా దూరమని స్టేట్‌మెంట్లు.. సందర్భం లేకుండా పీఆర్పీ టాపిక్ తెచ్చి జనసేనతో పోలికలతో సోషల్ మీడియాలో వైసీపీ వారికి కూడా టార్గెట్ అవుతున్నారు.. ఆ క్రమంలో మోగా స్టార్ హోదాకు తగ్గట్లు మాట్లాడం లేదని… టంగ్ స్లిప్ అవుతూ తన మెగా ఇమేజ్‌ని తానే డ్యామేజ్ చేసుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
వరుసగా సినిమా ఫంక్షన్లకు హాజరవుతున్న మెగా స్టార్ చిరంజీవి.. అత్యుత్సాహంతో మాట్లాడుతున్నారో? లేకపోతే అనాలోచితంగా టంగ్ స్లిప్ అవుతున్నారో? కాని తన స్టేట్‌మెంట్లతో సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్‌కి గురవుతున్నారు.. 47 ఏళ్ల సదీర్ఘ సినీ నేపధ్యం, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభమున్న పద్మవిభూషణ్ చిరంజీవి సినీ ఫంక్షన్ల వేదికలపై నుంచి చేస్తున్న వ్యాఖ్యలతో పలువురికి టార్గెట్ అవుతూ తన ఫ్యాన్స్‌నే ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడు పలు విమర్శలు ఎదుర్కొన్నారు. పీఆర్పీ నేర్పించిన అనుభవాలతో సమకాలీన రాజకీయాలు తనకు సెట్ కావని తెలుసుకుని పొలిటికల‌్ స్క్రీన్ మీద నుంచి సైడ్ అయిపోయారు .. మళ్లీ సినిమాల్లో బిజీ అయిన ఆయన తాజాగా వివిధ సినిమాల ఫంక్షన్లకు హాజరవుతూ .. మెగా ఇమేజ్ డ్యామేజ్ చేసుకునేలా మాట్లాడుతుండటం హాట్‌టాపిక్‌గా మారింది. మొన్నటి తన ప్రజారాజ్యమే రూపాంతరం చెంది జనసేనగా మారిందంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు.
సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అవుతున్నాయి … ఆయన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు జనసేను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు .. ప్రజారాజ్యం తరహాలో జనసేన దుకాణం కూడా బంద్ అవుతుందా అని సెట్లైరు వేస్తున్నారు.. జై జనసేన అంటూ తమ్ముడి పార్టీపై తన మమకారాన్ని చాటుకుని… జనసేనను డిఫెన్స్‌లోకి నెట్టేలా మాట్లాడం వివాదాస్పదంగా తయారైంది.
కొంతకాలంగా బీజేపీ నేతలు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో సన్నిహితంగా తిరుగుతున్న చిరంజీవికి … కూటమి తరపున మరోసారి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారన్న ప్రచారం జరిగింది… మరి ఆ లెక్కలేంటో కాని సడన్‌గా రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లు ప్రకటించారాయన.. తన జీవితంలో రాజకీయ ప్రస్థానం ముగిసిందని… రాజకీయంగా తన ఆశయాలను..ఇకపై పవన్ కల్యాణ్ నెరవేరుస్తారని చెప్పుకొచ్చారు. ఇటీవల పలువురు పెద్ద రాజకీయ నాయకులను కలుస్తుండడంతో.. చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారని..రాజకీయంగా తాను ఎలాంటి ముందడుగు వేయడం లేదన్నారు. తన సినిమాల ప్రమోషన్ కోసం, విశ్వంభర సినిమాపై ఎఫెక్ట్ పడుతుందన్న భయంతోనే రాజకీయాలకు దూరమని ప్రకటించారని వైసీపీ శ్రేణులు అయన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి.
తన మనవరాళ్లపై మెగా హీరో మాట్లాడిన మాటలు… వివాదాస్పదంగా మారాయి. తాను ఇంట్లో ఉంటే చుట్టూ మనవరాళ్లే ఉంటారని, అప్పుడు తనకు లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా అనిపిస్తుందని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఇప్పుడైనా కొడుకును కనాలని రామ్‌చరణ్‌కు చెబుతుంటానని, అప్పుడే మన లెగసీ కంటిన్యూ అవుతుందని గుర్తు చేస్తుంటానని చిరంజీవి వ్యాఖ్యానించారు. చిరంజీవి లెగసీ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. చిరంజీవి స్థాయి వ్యక్తి మగపిల్లలే వారసులనడం కరెక్ట్ కాదని..ఆడపిల్లలు వారసులు కాదా అని జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.
Also Read: కాస్త సినిమాను ప్రమోట్ చేయండి బిగ్ బాస్.. మ్యాటర్ గతి తప్పుతోంది!
వారసులు విషయంలోనే కాదు… తన తాతపై కూడా చిరంజీవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు… ఆయన మంచి రసికుడని, తనకు ఎవరి బుద్ధులు వచ్చినా ఫర్లేదు కానీ, తాత బుద్ధులు మాత్రం రాకూడదని కోరుకునేవారని చెప్పారు. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యల్ని కూడా నెటిజన్లు తప్పుబడుతున్నారు. వరుసగా చేస్తున్న వ్యాఖ్యలతో చిరంజీవి నెట్టింట్లో తీవ్రంగా ట్రోల్ అవుతుండటం ఆయన ఫ్యాన్స్‌కు మింగుడు పడటం లేదంట.. పద్మవిభూషన్ పురస్కారం పొందిన ఆయన ఆ స్థాయికి తగ్గట్లు మాట్లాడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి.. మరి మెగాహీరో తన వ్యాఖ్యలకు ఎలాంటి కవరింగ్ ఇచ్చుకుంటారో చూడాలి.