Kota Srinivas Rao: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ పాత్రలకు కరుడుగట్టిన విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వారిలో టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు(Kota Srinivas Rao) ఒకరు. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో కమెడియన్ పాత్రలలోను అలాగే విలన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఒకానొక సమయంలో విలన్ పాత్ర అంటేనే మొదటగా దర్శక నిర్మాతలకు కోటా శ్రీనివాసరావు గారు గుర్తుకు వచ్చేవారు. కొన్ని వందల సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను పురస్కారాలను సొంతం చేసుకున్న కోటా శ్రీనివాసరావు ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు.
అనారోగ్య సమస్యలు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన వయసు పై పడటంతో సపోర్టింగ్ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఇటీవల ఈయన బయట ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఆయన నడవాలన్న ఒకరి సపోర్ట్ అవసరం కావడంతో కేవలం ఇంటి పట్టునే ఉంటూ పలు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉండేవారు . అయితే ఈ ఇంటర్వ్యూల సందర్భంగా సినిమా ఇండస్ట్రీ గురించి అలాగే హీరోల గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు ఒకానొక సమయంలో వివాదాలకు కూడా కారణమయ్యాయి. పలువురు సెలబ్రిటీల గురించి ఈయన మాట్లాడిన తీరు తీవ్రస్థాయిలో విమర్శలకు గురి చేసింది.
గుర్తుపట్టలేనంతగా…
తాజాగా కోట శ్రీనివాసరావుకి సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh)కోటా శ్రీనివాసరావు గారిని తన ఇంట్లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఇలా ఆయనతో కలిసి ఉన్న ఫోటోని బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా ఈ ఫోటోని షేర్ చేసిన బండ్ల గణేష్ “కోటా శ్రీనివాసరావు గారితో ఈరోజు, కోటా బాబాయ్ ను కలవడం చాలా సంతోషంగా ఉంది” అంటూ ఈయన తనతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలో ఫోటో శ్రీనివాసరావు మాత్రం గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. పూర్తిగా బక్కచిక్క పోవటమే కాకుండా, కాళ్లకు కూడా గాయాలు కావడంతో మొత్తం బ్యాండేజ్ వేసి ఉన్నారు. కోట శ్రీనివాసరావు గారిని ఈ పరిస్థితుల్లో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
కోట శ్రీనివాసరావుని కలిసిన నిర్మాత బండ్ల గణేష్ #BandlaGanesh #ActorKotaSrinivasaRao #Tollywood #BIGTVCinema pic.twitter.com/hKykdpjrCb
— BIG TV Cinema (@BigtvCinema) June 10, 2025
ఇక ఈయనకు వయసు పై పడటంతో పలు అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయని స్పష్టమవుతుంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఏమాత్రం విరామం లేకుండా గడిపిన కోటా శ్రీనివాసరావు ఇప్పుడు మాత్రం సినిమా అవకాశాలు వచ్చిన చేయలేని పరిస్థితులలో ఉండిపోయారని తెలుస్తుంది. ఇక ఈయన కాళ్లకు బ్యాండేజ్ వేసి ఉండడంతో అతని కాళ్ళకు ఏమైంది? షుగర్ వంటి సమస్యలు ఉన్నాయా? అందుకే ఇలా మారిపోయారా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కోటా శ్రీనివాసరావు గారి అనారోగ్య సమస్యలు ఏంటి అనే విషయం తెలియదు కానీ ఈయన మాత్రం క్షేమంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.