Actor Murali Sharma: టాలీవుడ్ విలక్షణ నటుల్లో మురళీ శర్మ ఒకరు. పాత్ర ఎలాంటిదైనా సరే.. ఆయన దిగనంతవరకే.. ఒక్కసారి పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తే మాత్రం ఆ పాత్ర హిట్ అవ్వాల్సిందే. విలన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఈ నటుడు.. సపోర్టింగ్ రోల్స్ తో అదరగొడుతున్నాడు. భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి, కృష్ణగాడి వీర ప్రేమకథ, వినరో భాగ్యం విష్ణు కథ లాంటి సినిమాల్లో ఆయన నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక అల వైకుంఠపురంలో మురళీ శర్మ పాత్రకు విమర్శల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలన్నింటిలో ఆయన నటిస్తున్నాడు.
ఇక మురళీ శర్మను చూసి.. నార్త్ నుంచి వచ్చాడు అనుకుంటారు. కానీ, అచ్చమైన తెలుగువాడు. చాలా తక్కువగా ఇంటర్వ్యూలు ఇచ్చే ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని తన మనోగతాన్ని చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా అవమానాలు పడినట్లు చెప్పుకొచ్చాడు.
మురళీ శర్మ తండ్రి ఉత్తరప్రదేశ్ కు చెందినవారు కాగా.. తల్లి గుంటూరు నివాసి. అందుకే ఆయన తెలుగు చక్కగా మాట్లాడతాడు. ఇక తన కెరీర్ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో అద్భుతంగా ఉందని, ప్రేక్షకులు తనను ఎంతో ఆదరించారని తెలిపాడు. అందుకే తనను ఎవరైనా సెల్ఫీలు అడిగినా.. టీ తాగేవాడినల్లా దాన్ని పక్కన పెట్టి మరీ ఇస్తాను అని చెప్పుకొచ్చాడు.
Akkineni Naga Chaitanya: శోభితాతో పెళ్లి.. నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను
ఇక 90 వ దశకంలో బాలీవుడ్ లో అప్పుడే షారుఖ్, అమీర్ వస్తున్నారు. ఆ సమయంలో నేను వచ్చాను. అప్పుడు అందంగా ఉండే ఫేస్ లనే హీరోలుగా తీసుకొనేవారు. నాలాంటి వారిని అసలు చూసేవారు కాదు. నేను నా ఫొటోస్ పట్టుకొని ఆఫీస్ ల చుట్టూ తిరిగినప్పుడు అందరు.. నువ్వు యాక్టర్ అవుతావా.. ? ఎప్పుడైనా నీ ముఖం అద్దంలో చూసుకున్నావా అని అడిగేవారు. నాకు చాలా బాధ అనిపించేది. రోజు కన్నీళ్లతో ఇంటికి వెళ్ళేవాడిని. మనసు ముక్కలయ్యేది. కానీ, పొద్దునే మళ్లీ ప్రయత్నాలు చేసేవాడిని. ఎందుకంటే నాకు వేరే అప్షన్ లేదు. వేరే ఛాయిస్ ఉన్నా కూడా ఇంట్రెస్ట్ ఎప్పుడు సినిమాల మీదనే ఉండేదని” చెప్పుకొచ్చాడు.
మురళీ శర్మ భార్య కూడా నటినే. ఆమె పేరు అశ్విని కళేష్కర్. వీరిది ప్రేమపెళ్లి. బద్రీనాథ్ సినిమాలో తమన్నాకు అత్తగా నటించింది అశ్విని. ఈ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. ఇక తన భార్య గురించి, ప్రేమ గురించి మురళీ శర్మ మాట్లాడుతూ.. ” నా భార్య అశ్విని ఒక మరాఠీ. ఆమె కూడా నటిని.
తెలుగులో ఆమె చేసిన బద్రీనాథ్, నిప్పు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. మా ప్రేమ పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. కాలేజ్ చదివే రోజుల్లో అయితే ప్రేమ అనగానే ఇంటర్ క్యాస్ట్ అని వద్దు అనేవాళ్ళేమో.. కానీ, నా జీవితంలో అన్ని లేట్ గానే జరిగాయి. అందుకే మా పెళ్ళికి ఎవరు నో చెప్పలేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మురళీ శర్మ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.