BigTV English

Akkineni Naga Chaitanya: శోభితాతో పెళ్లి.. నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను

Akkineni Naga Chaitanya: శోభితాతో పెళ్లి.. నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను

Akkineni Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య  ప్రస్తుతం తండేల్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. మొట్ట మొదటిసారి చై.. పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.  చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బన్నీవాసు నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చై  సరసన సాయిపల్లవి నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.


పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రమోషన్స్ అన్ని చై దగ్గరుండి చేయిస్తున్నాడు.  ఫిబ్రవరి 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన  చై.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి కాకుండా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా చెప్పుకొచ్చాడు. గతేడాది చై.. నటి శోభితాను రెండో పెళ్లి చేసుకున్న విషయం విదితమే.

ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సమంతను ప్రేమించి పెళ్లాడిన చై.. విభేదాల వలన నాలుగేళ్లు కూడా కలిసి ఉండకుండానే విడాకులు తీసుకున్నారు. ఇక సామ్ తో విడాకుల అనంతరం  శోభితాతో డేటింగ్ చేసి గతేడాది డిసెంబర్ 4 న ఇరువర్గాల అంగీకారంతో  పెళ్లి చేసుకున్నాడు. శోభితాకు  ఇదే మొదటి వివాహం. అమ్మడిది  తెనాలి అయినా.. వైజాగ్ లో పెరిగింది. చదువు తరువాత మోడల్ గా ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ లో పాగా వేసింది.


Pooja Hegde: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బుట్టబొమ్మ లిప్ కిస్ వీడియో.. అవకాశాల కోసమే.. ?

ఇక తెలుగులో ఆమె చేసినవి రెండే రెండు సినిమాలు. అవి కూడా హీరోయిన్ గా కాదు కీలక పాత్రలు. గూఢచారి, మేజర్. గూఢచారి సినిమాలో చై కజిన్ సుప్రియ యార్లగడ్డ నటించింది. ఆమె కోసం శోభితా అప్పుడప్పుడు అక్కినేని ఇంటికి వెళ్లేదని, అలా చై కి పరిచయమని  టాక్. ఆ తరువాత వీరి పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్లు డేటింగ్ లో ఉండి పెళ్లి చేసుకున్నారు.  ఇక వీరికి పెళ్లి అయిన రెండు నెలలు అవుతుంది. ఈ రెండు నెలల గురించి చై ఒక ఆంగ్ల ఇంటర్వ్యూలో నోరు విప్పాడు.

” శోభితాతో పెళ్లి తరువాత లైఫ్ చాలా ప్రశాంతంగా, గొప్పగా ఉంది. నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మా పెళ్లి అయ్యిం రెండు నెలలే అవుతుంది. ఇద్దరం ఒకరికొకరం సమయాన్ని కేటాయిస్తున్నాం. ఒకపక్క వర్క్.. ఇంకోపక్క పర్సనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తున్నాం. నిజం చెప్పాలంటే శోభితాను చూస్తే నన్ను నేను చూసుకుంటున్నట్లు ఉంటుంది. మా ఇద్దరిలో చాలా విషయాలు కలుస్తాయి.

ఇద్దరం ఆంధ్రావాళ్లం. నాది వైజాగ్ కాకపోయినా.. ఆ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. మా ఇద్దరి నగరాలూ వేరు అయినా.. మూలాలు ఒకటే. ఇద్దరం సాంప్రదాయాలను నమ్ముతాం. ఇద్దరికీ  సినిమాలు అంటే ఇష్టం. వాటి గురించే  ఎక్కువ మాట్లాడుకుంటాం. ట్రావెల్ అవుతాం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.  మరి తండేల్  సినిమా చైకు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×