Jr.NTR : జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR).. మాస్ ఆటిట్యూడ్ కి కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. తన నటన, డాన్స్ తోనే కాదు పర్ఫెక్ట్ స్టైల్ మెయింటైన్ చేస్తూ అందరిని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఎన్టీఆర్ మాస్ ఆటిట్యూడ్ కి ఫిదా అయ్యే అమ్మాయిలు ఎంతోమంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా తన భార్య లక్ష్మీ ప్రణతి (Lakshmi Pranathi) తో కలిసి ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు ఎన్టీఆర్. ఎంతో క్యాజువల్ లుక్ లో కనిపించిన ఎన్టీఆర్ తన లుక్కుతో అందరిని ఫిదా చేశారు. ముఖ్యంగా బ్లాక్ టౌజర్, వైట్ టీ షర్ట్ ధరించిన ఆయన స్టైలిష్ కళ్లజోడుతో ఎయిర్ పోర్ట్ లో చాలా క్యాజువల్ గా ఉన్నా.. స్టైల్ ని మాత్రం మెయింటైన్ చేయడం అందరిని అబ్బురపరుస్తోంది.
స్టైలిష్ లుక్ లో జోడీగా కనిపించిన ఎన్టీఆర్..
ఎయిర్పోర్టులో స్టైలిష్ లుక్ లో కనిపించిన ఈ క్యూట్ కపుల్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ముఖ్యంగా ఎయిర్ పోర్ట్ లుక్ లోను ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఆటిట్యూడ్ స్పష్టంగా కనిపించిందని చెప్పవచ్చు. ఆయన ఎక్కడ ఉన్నా ఏ సినిమాకి అయినా తన గెటప్ ను మార్చినా.. తన స్టైల్ ని మాత్రం మిస్ అవ్వకుండా మాస్ ఆటిట్యూడ్ ను కంటిన్యూ చేస్తూ.. తన స్టాండర్డ్స్ ని నిలబెట్టుకుంటున్నాడు ఎన్టీఆర్. రఫ్ అండ్ టఫ్ లుక్ తో డీప్ బ్లాక్ షేడ్స్ తో ఎన్టీఆర్ కనిపించడంతో అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారు. చాలా రోజుల తర్వాత తన భార్యతో కలిసి ఇలా పబ్లిక్ లో దర్శనం ఇవ్వడంతో ఈ ఫోటోలు మరింత వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ సినిమాలు..
ఎన్టీఆర్ , రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్(RRR) సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ అయిపోయారు. మాన్ ఆఫ్ మాస్సెస్ గా పేరు దక్కించుకున్న కొరటాల శివ (Koratala siva) దర్శకత్వంలో దేవర(Devara) సినిమా చేశారు. ఈ సినిమా మొదట నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా.. ఆ తర్వాత పాజిటివ్ టాక్ తో దూసుకుపోయి ఏకంగా రూ.600 కోట్ల క్లబ్లో చేరిపోయింది.ఇక ఈ సినిమా తర్వాత ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటిస్తున్న ‘వార్2’ సినిమాలో విలన్ గా నటించబోతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబో ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి అటు అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర 2’ కూడా చేయబోతున్నారు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప 2 ‘రేంజ్ లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా దేవర సినిమాలో మిస్సయిన ఎన్నో అంశాలను ఇందులో చూపించబోతున్నారట డైరెక్టర్. అందులో భాగంగానే పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఎన్టీఆర్ వరుస సినిమాలు ప్రకటిస్తూ ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకుంటున్నారు అని చెప్పవచ్చు.