Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు ( Champions Trophy 2025 ) సంబంధించిన మరో కీలక అప్డేట్ వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 ) ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ ప్రారంభానికి కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో పాకిస్తాన్ దేశంలో అన్ని క్రికెట్ స్టేడియాలు సిద్ధమవుతున్నాయి. మరో 10 రోజుల్లోనే పాకిస్తాన్ ( Pakistan ) క్రికెట్ స్టేడియాలు పూర్తిస్థాయిలో సిద్ధం కానున్నాయి.
Also Read: RCB Fandom: ఇదేం క్రేజ్ రా బాబు.. RCB ప్లేయర్లతోనే చిన్నారి బర్త్ డే
అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఆడేటువంటి పాకిస్తాన్ జట్టును ( Pakistan’s Squad For 2025 Champions Trophy ) తాజాగా… ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించడం జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో.. ప్రకటన కూడా చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇక చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఆడే జట్టు కెప్టెన్ గా… రిజ్వాన్ ను ( Rizwan ) నియామకం చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. 16 మందితో కూడిన పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ గా రిజ్వాన్ ( Rizwan ).
అలాగే చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు ( Champions Trophy 2025 ) ప్రకటించిన… పాకిస్తాన్ జట్టులో బాబర్ అజాం, షాహిన్ ఆఫ్రిది, హరీష్, లాంటి ప్రముఖ ప్లేయర్లు కూడా ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఆఫ్రీది జట్టులోకి వస్తున్నాడు. ఇక అటు బాబర్ గత కొన్ని రోజులుగా ఫామ్ లేక బాధపడుతున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ ఎలాగా బాధపడుతున్నాడో… ఇప్పుడు బాబర్ అజాం పరిస్థితి అలాగే ఉంది. అయినప్పటికీ చాంపియన్ ట్రోఫీ జట్టులో… బాబర్ అజాం కు ఛాన్స్ దక్కింది.
ఇది ఇలా ఉండగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరుగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఎడిషన్ పాకిస్థాన్లోని మూడు వేదికలు, దుబాయ్లో ఒక వేదికలో జరగనుంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్…. పాక్ లో పర్యటించదని, అన్ని మ్యాచ్ లను దుబాయ్ లోనే ఆడనుందని తెలిపింది ఐసీసీ. ఒకవేళ టీమిండియా ఫైనల్ కు అర్హత సాధిస్తే టైటిల్ పోరు కూడా దుబాయ్ లోనే జరుగుతుంది. అదే సమయంలో ఒకవేళ టీమిండియా ఫైనల్ కు అర్హత సాధించక పోతే… పాకిస్థాన్లోని మూడు వేదికలలో ఒక వేదికలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ జరుగనుంది. కాగా, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్లో కెప్టెన్ల ఫోటోషూట్ లేదా కాన్ఫరెన్స్ ఉండదని ఆతిథ్య క్రికెట్ బోర్డు వర్గాలు గురువారం పిటిఐకి తెలిపాయి.
Also Read: Ind vs Eng, 4th T20I: టాస్ ఓడి బ్యాటింగ్ చేయనున్న టీమిండియా..రింకూ ఇన్.. షమీ అవుట్ !
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్తాన్ జట్టు:
రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ ఆజమ్, ఫఖర్, కమ్రాన్, సాకీల్, తయాబ్, ఫహీమ్, ఖుష్దిల్, సల్మాన్ ఆఘా, ఉస్మాన్, అబ్రార్, హారిస్, హస్నైన్, నసీమ్, షాహీన్.
Pakistan name ICC Champions Trophy 2025 squad
Details here ➡️ https://t.co/XfswdRVWrO #WeHaveWeWill | #ChampionsTrophy pic.twitter.com/kGA9hJr4dV
— PCB Media (@TheRealPCBMedia) January 31, 2025