BigTV English
Advertisement

Actor Naresh on Pawan Kalyan: కృష్ణగారు పొత్తులు పెట్టుకోలేదు.. పవన్ పై నరేష్ సంచలన వ్యాఖ్యలు!

Actor Naresh on Pawan Kalyan: కృష్ణగారు పొత్తులు పెట్టుకోలేదు.. పవన్ పై నరేష్ సంచలన వ్యాఖ్యలు!

Actor Naresh Sensational Comments on Pawan Kalyan: సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడంటే కొంతవరకు సైలెంట్ గా.. సోషల్ మీడియాలో హల్చల్ చేయకుండా ఉన్నాడు కానీ, నాలుగు నెలల క్రితం వరకు అంతా నరేష్ దే చర్చ. పవిత్రా లోకేష్ తో ప్రేమ, పెళ్లి.. ముద్దు ఇలా ఎక్కడ చూసినా వీరే కనిపించేవారు. ఇక ఇప్పుడు అదంతా తగ్గి.. ఎవరి కెరీర్ లో వారు బిజీ అయ్యారు. అప్పుడప్పుడు నరేష్.. సోషల్ మీడియాలో రాజకీయపరంగా తన అభిప్రాయాలను తెలుపుతూ ఉంటాడు. ఈ మధ్య ప్రచారంలో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్.. దివంగత నటుడు కృష్ణ గురించి మాట్లాడాడు.


ఎన్టీఆర్, కృష్ణ వేరు వేరు పార్టీలో ఉన్నారు. ఎన్టీఆర్ ను కృష్ణ ఎంత విమర్శించినా, వ్యతిరేకించినా.. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా సినిమాలు చేసినా ఆయన ఒక్క మాట కూడా అనలేదు. ఎన్టీఆర్ అంతటి సంస్కారవంతుడు.. కానీ, జగన్ మాత్రం ఎప్పుడు తన పెళ్లిళ్ల గురించి, భార్యల గురించి తప్ప వేరే ఏది మాట్లాడాడు అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యలపై నరేష్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. కృష్ణ గారి మనస్తత్వం గురించి చెప్పుకొచ్చాడు.

” మిస్టర్ పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో సూపర్ స్టార్ స్వర్గీయ శ్రీకృష్ణగారిని విమర్శించడం విని షాక్ అయ్యాను.చాలా బాధపడ్డాను కూడా. కృష్ణ గారిది బంగారు హృదయం. రాజకీయాల్లో ఎప్పుడు విలువలు కలిగి ఉన్న మనిషి. సినీ పరిశ్రమకు, రాజకీయాలకు ఆయన చేసిన కృషి ఎనలేనిది. ఆయన తన రాజకీయ ప్రసంగాల్లో పొత్తులు మార్చుకోలేదు, ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. భవిష్యత్తులో కృష్ణ గారికి సంబంధించిన ఇలాంటి పదాలు తొలగించవలసిందిగా అందరినీ సవినయంగా కోరుతున్నాను.


Also Read: Renu Desai: ఆ పార్టీకే నా సపోర్ట్.. డబ్బు తీసుకోకుండా చెప్తున్నా.. పవన్ మాజీ భార్య పోస్ట్ వైరల్

నటుడిగా మరియు రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ పట్ల నాకు చాలా గౌరవం ఉంది. నేను ఆయనను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుగా చూస్తున్నాను. Bjp మాజీ యూత్ లీడర్ గా, అధ్యక్షుడిగా మరియు ప్రధాన కార్యదర్శిగా నేను AP యొక్క కీర్తిని తిరిగి పొందేందుకు NDA కూటమి యొక్క ఘన విజయం కోసం ప్రార్థిస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×