Big Stories

TS RTC Bus Fight: మళ్లీ అదే గోల.. భార్యల సీట్ల కోసం చెప్పుతో కొట్టుకున్న భర్తలు

TS RTC Bus Fight: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహాలక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఉచిత ప్రయాణం కల్పించినందుకు ఓవైపు హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలే.. మరోవైపు కొట్లాటకు దిగుతున్నారు. బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుండడంతో సిగపట్లు పడుతున్న దృశ్యాలను తరచూ చూస్తూనే ఉన్నాం.

- Advertisement -

కండక్టర్ ను తిట్టడం లేదా కొట్టడం, సీట్ల కోసం ఆడవాళ్లు తన్నుకోవడం వంటివి చాలా వీడయోలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ బస్సులో తమ భార్యల సీట్ల కోసం భర్తలు దారుణంగా కొట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

- Advertisement -

మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఈ ఘటన వెలుగుచూసింది. తొర్రూరు డిపోకు చెందిన ఓ ఎక్స్ ప్రెస్ బస్సులో ఉప్పల్ క్రాస్ రోడ్డు వెళ్లేందుకు సాయంత్రం బస్టాండ్ లో బస్సు వేచి ఉంది. ఈ తరుణంలో అందరూ సీట్ల కోసం ఖర్చీఫ్ లు, బ్యాగ్ లు వేస్తూ ఎక్కుతున్నారు. అయితే ఒకరు ఖర్చీఫ్ వేశాక వారి సీట్లో వేరే ప్రయాణికులు కూర్చున్నారు. దీంతో తమ సీట్లో ఎందుకు కూర్చున్నారంటూ గొడవకు దిగారు. దీంతో గొడవ కాస్త ముదిరింది. ఇక భార్యలు గొడవ పెట్టుకోవడం చూసిన భర్తలు రంగంలోకి దిగారు.

భార్యల గొడవ కాస్త భర్తల మధ్య గొడవకు దారి తీసింది. దీంతో చెప్పులు తీసి మరి ఇష్టం ఉన్నట్లు కొట్టుకున్నారు. తోటి ప్రయాణికులు ఆపేందుకు ప్రయత్నించినా ఆగలేదు. దీంతో ఆర్టీసీ సిబ్బంది 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News