BigTV English
Advertisement

Actor Prabhas : అనిల్ రావిపూడి అంటే కామెడీ సినిమాలు చేస్తాడు అతనా.?

Actor Prabhas : అనిల్ రావిపూడి అంటే కామెడీ సినిమాలు చేస్తాడు అతనా.?

Actor Prabhas: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ కి ఎంత క్రేజీ ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ కెరియర్ విషయానికి వస్తే బాహుబలి సినిమాకి ముందు బాహుబలి సినిమా తర్వాత అని చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ టైటిల్ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు ప్రస్తుతానికి ఇది వర్కింగ్ టైటిల్ అనుకుంటున్నారు. ఇకపోతే రీసెంట్ గానే రిలీజ్ అయిన కల్కి సినిమాతో 1,000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు సాధించాడు ప్రభాస్. ఇక ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది.


ఈ సినిమాలో నటుడు వీటిని గణేష్ ఒక ప్రముఖ పాత్రలో కనిపించనున్నారు. వీటిని గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలు చేసినా కూడా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన బీస్ట్ సినిమాలో డైలాగ్ తో బాగా పాపులర్ అయ్యారు. వీటివి గణేష్ అంటే అందరికీ తెలియకపోవచ్చు. అని ఒక డైలాగ్ చెప్తే మాత్రం ఆయన రూపం టక్కున గుర్తొస్తుంది. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్ అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఇప్పటికీ కొన్ని మీమ్స్ లో కూడా ఆ డైలాగ్ కనిపిస్తూ ఉంటుంది. చాలామంది సాధారణ జీవితంలో కూడా ఆ డైలాగును విపరీతంగా వాడుతూ ఉంటారు. ఇకపోతే గణేష్ రాజా సాబ్ సినిమాలో ఒక కీలక పాత్రను చేస్తున్నాడు. అదే టైంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కూడా నటించాల్సి ఉంది. కేవలం ఒక్క రోజులో షూటింగ్ అయిపోయే ఆ రోల్ కోసం గణేష్ ను పిలిపించారట చిత్ర యూనిట్. దానికోసం దర్శకుడు మారుతి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు గణేష్. ఆ తరుణంలో ఎవరు సినిమా ఏంటి అని చాలా విషయాలు అడిగాడు ప్రభాస్. అప్పుడు అనిల్ రావిపూడి అని చెప్పగానే, కామెడీ సినిమాలు చేస్తాడు అంటూ ప్రభాస్ అన్నారట. కాదు సార్ బాలకృష్ణతో భగవంత్ కేసరి లాంటి ఎమోషనల్ ఫిలిం కూడా చేశాడు అంటూ చెప్పుకొచ్చాడంట గణేష్.

Also Read : Mahesh Babu: అక్క బర్త్ డేలో మెరిసిన మహేష్ బాబు.. ఫ్యామిలీ అంతా ఓకేచోట..!


ఇక అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పటాస్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనిల్ అతి తక్కువ రోజుల్లోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరో తో కూడా సినిమా చేసే స్థాయికి ఎదిగాడు. అనిల్ చేసిన ఎక్కువ సినిమాలు కూడా కామెడీ ఓరియంటెడ్ ఉంటాయి. అనిల్ చేసిన ఎఫ్2 సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను చేస్తున్నాడు అనిల్. అయితే అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అనిల్ రావిపూడి ప్రభాస్ కు తెలియదా అని కొంతమంది సందేహం. అయితే అనిల్ రావిపూడి కేవలం కామెడీ సినిమాలు మాత్రమే చేస్తాడు. అని ప్రభాస్ దృష్టిలో ఉంది అని కొంతమందికి క్లారిటీ వచ్చింది. ఇక అనిల్ తన సేఫ్ జోన్ విడిచిపెట్టి కొత్తరకం సినిమా చేశాడు అంటే అది భగవంత్ కేసరి బహుశా అది ప్రభాస్ చూసి ఉండకపోవచ్చు. కానీ వీటివి గణేషన్ పర్మిషన్ అడగగానే మారుతి మాత్రం పంపించారు అంటూ చెప్పుకొచ్చాడు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×