BigTV English

YS Jagan – RGV: దర్శకుడు ఆర్జీవీకి జగన్ సపోర్ట్.. షాకిచ్చిన ప్రకాశం పోలీస్.. 25న విచారణకు రాకుంటే?

YS Jagan – RGV: దర్శకుడు ఆర్జీవీకి జగన్ సపోర్ట్.. షాకిచ్చిన ప్రకాశం పోలీస్.. 25న విచారణకు రాకుంటే?

YS Jagan – RGV: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు మాజీ సీఎం జగన్ మద్దతు పలికారు. ఇటీవల ఆర్జీవీకి పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో జగన్ ఘాటుగా స్పందించారు. జగన్ స్పందించిన కొద్ది క్షణాలకే ఆర్జీవీకి పోలీసులు దిమ్మతిరిగే షాకిచ్చారు.


దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వైసీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లక్ష్యంగా పోస్టులు పెట్టారన్నది ఆరోపణ. అలాగే వ్యూహం సినిమా సమయంలో మార్ఫింగ్ ఫోటోలతో సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారింది. వైసీపీ ఘోర ఓటమిని చవి చూసింది.

ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టులపై కన్నెర్ర జేస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా మహిళలను వ్యక్తిగతంగా వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ పేరు కూడా తెరపైకి వచ్చింది.


గత ప్రభుత్వ హయాంలో పలు మార్లు వివాదాస్పద రీతిలో పోస్టులు పోస్ట్ చేశారన్నది అభియోగం. అయితే ఈ క్రమంలో ఆర్జీవీ గతంలో చేసిన పలు పోస్టులపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా అందింది. ఈ ఫిర్యాదుతో పోలీసులు, హైదరాబాద్ వచ్చి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని కోరారు. ఆర్జీవీ మాత్రం తనకు ఉన్న వ్యక్తిగత పనుల నిమిత్తం 4 రోజులు గడువు కోరుతూ.. ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబుకు వాట్సాప్ ద్వారా విన్నవించారు.

అయితే తాజాగా సీఐ శ్రీకాంత్ బాబు కూడా.. ఈనెల 25వ తేదీన పోలీసులు ముందు విచారణకు హాజరుకావాలని మరోమారు ఆర్జీవీ వాట్సాప్ నెంబర్ కు నోటీసులను పంపించారు. ఇలా ఆర్జీవీ వర్సెస్ పోలీసులకు నోటీసుల పర్వం సాగుతున్న క్రమంలో మాజీ సీఎం జగన్ స్పందించారు.

Also Read: Tamil Nadu Crime: టీచర్ ను ప్రేమించాడు.. క్లాస్ రూమ్ లోనే పొడిచాడు.. ఆ తర్వాత?

దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా తీయడమే తప్పు అన్నట్లుగా కేసులు నమోదు చేస్తున్నారని, వర్మ చేసిన సినిమాకి సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉందన్న విషయాన్ని గమనించాలన్నారు. రాంగోపాల్ వర్మను అక్రమంగా అరెస్టు చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, మీకు అనుకూలంగా సినిమాలు తీస్తే ఓకేనా అంటూ ప్రశ్నించారు. ఈ కామెంట్స్ తో ఆర్జీవీకి జగన్ మద్దతు తెలిపినట్లుగా భావించవచ్చని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. మొత్తం మీద ఈనెల 25న విచారణకు హాజరుకావాలన్న పోలీసుల నోటీసులకు రాంగోపాల్ వర్మ ఎటువంటి సమాధానమిస్తారో వేచి చూడాలి. విచారణకు డుమ్మా కొడితే ప్రకాశం ఎస్పీ దామోదర్ ఏ చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×