BigTV English
Advertisement

Prabhas : డార్లింగ్‌లో ఓ స్పెషల్ టాలెంట్… సినిమా పిచ్చొళ్లకు కూడా సాధ్యం కానిది.. ప్రభాస్ సొంతం

Prabhas : డార్లింగ్‌లో ఓ స్పెషల్ టాలెంట్… సినిమా పిచ్చొళ్లకు కూడా సాధ్యం కానిది.. ప్రభాస్ సొంతం

Prabhas : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో ప్రభాస్ ఒకరు. మామూలుగా సాగిపోతున్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బాహుబలి సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. మంచి ఫామ్ లో ఉన్న హీరో ఒక సినిమా కోసం దాదాపు 5 ఏళ్ళు సమయాన్ని కేటాయించడం అనేది మామూలు విషయం కాదు. ఆ టైంలో ప్రభాస్ బాహుబలి సినిమా కోసం అంత రిస్క్ చేశారు. అయితే బాహుబలి సినిమా రిలీజ్ తర్వాత ప్రభాస్ స్థాయి కంప్లీట్ గా మారిపోయింది. ఇప్పటివరకు బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలైంది. ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ సినిమా కోసం ఆడియన్స్ ఎదురు చూడటం మొదలుపెట్టారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 100 కోట్లు సినిమా చూడటమే గగనం అనుకునే తరుణంలో ప్రభాస్ తన కెరియర్ లో ఇప్పటివరకు 1000 కోట్లు సినిమాలు రెండు చేసేసాడు. ఇక ముందు రాబోయే సినిమాలు కూడా అదే స్థాయిలో ఉండబోతున్నాయని చెప్పాలి.


బాహుబలి సినిమా కంటే ముందు కూడా ప్రభాస్ కెరియర్ లో మంచి సినిమాలు ఉన్నాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన సినిమా చక్రం. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా కూడా, ఈ సినిమాకి ఇప్పటికీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో జగమంత కుటుంబం నాది అనే పాట ఎంత పాపులర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఈ పాట కోసమే కృష్ణవంశీ చక్రం అనే సినిమాను తీశారు. మొదట ఈ పాటను విన్నప్పుడు ప్రభాస్ కి పెద్దగా ఏమీ అర్థం కాలేదట. ఆ తర్వాత ఈ పాట అర్థం తెలుసుకొని చాలాసార్లు కన్నీళ్లు పెట్టుకున్నాను అని తెలిపాడు. ఇక రీసెంట్ గా ఈ పాట గురించి డిస్కషన్ జరిగినప్పుడు కూడా ప్రభాస్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.

Also Read: Sai Dharam Tej: సింగిల్స్ డే.. ఒక వర్గానికి నువ్వు ఇన్స్పిరేషన్ బ్రో..


మామూలుగా పాటలు చాలామంది వింటూ ఉంటారు. కానీ ఆ పాటలోని సాహిత్యాన్ని గుర్తించిన వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. వారిలో ప్రభాస్ లాంటి హీరో ఉండటం అనేది ఆశ్చర్యకరం. రీసెంట్ గా ప్రభాస్ ఒక మ్యూజికల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటల ప్రస్తావన వచ్చింది. అయితే సిరివెన్నెల గారు రాసిన ప్రతి పాటలోని లిరిక్స్ ను చెప్తున్నాడు ప్రభాస్. ఇటు నుంచే అటు వెళ్లారు సినిమా హీరోలంతా.. పైనుంచి ఏం దిగి రాలేదు మన తారాగణమంతా, భద్రం బి కేర్ ఫుల్ బ్రదరు, ఛలోరే ఛలోరే ఛల్ వంటి పాటల లోని లిరిక్స్ ను అవలీలగా మాట్లాడుతున్నాడు ప్రభాస్. ఒక పాన్ ఇండియా హీరోకి ఈ లెవెల్ సాహిత్యం విలువలు ఉండటం అనేది గొప్ప విషయం. రీసెంట్ టైమ్స్ లో వస్తున్న పాటలన్నీటిలో లిరిక్స్ ను డామినేట్ చేసే విధంగా సంగీతం ఉంటుంది. ప్రభాస్ లాంటి హీరోలు ఉండటం వలన సాహిత్యానికి పెద్దపీఠ వేసినట్లు అవుతుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×