Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది మొత్తం సోషల్ మీడియాలో తేజ్ పేరునే మారుమ్రోగిపోయింది. వివాదాలు కానీ, విమర్శలు కానీ.. సోషల్ మీడియాలో హైలైట్ అయ్యింది మాత్రం మెగా మేనల్లుడే. ఇక ఒకప్పుడు అల్లరిచిల్లరిగా ఆకతాయిగా కనిపించిన తేజ్.. రోడ్డుప్రమాదం తరువాత జీవితం గురించి తెలుసుకున్నాడు. కొన్ని కొన్ని విషయాలను చాలా సీరియస్ గాతీసుకున్నాడు.
ముఖ్యంగా హెల్మెట్ ప్రచారం చేయడంలో తేజ్ ఎప్పుడు ముందే ఉంటాడు. ఇక విరూపాక్ష లాంటి మంచి హిట్ తరువాత తేజ్ నటిస్తున్న చిత్రం SDT18. ఈ సినిమాపైనే తేజ్ అన్ని ఆశలు పెట్టుకున్నాడు. అంటే విరూపాక్ష భారీ విజయాన్ని అందుకోవడంతో.. తదుపరి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కెపి రోహిత్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.
Samantha: నా వల్ల కాలేదు.. వాళ్లు నన్ను చాలా ఏడిపించారు
ఇక ఈ సినిమాలో తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి నటిస్తుండగా.. జగపతి బాబు, శ్రీకాంత్, సాయి కుమార్ లాంటి స్టార్ నటులు నటిస్తున్నారు. మెగా మేనల్లుడు సినిమాల విషయం పక్కన పెడితే.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో తేజ్ కూడా ఒకడు. ఎప్పుడెప్పుడు తేజ్ పెళ్లి కొడుకు అవుతాడా.. ? అని ఫ్యాన్స్ అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. కానీ, మనోడు మాత్రం సోలో లైఫ్ సో బెటర్ అంటూ చెప్పుకొస్తున్నాడు. అది ఎంతలా అంటే.. ప్రతి ఏడాది సింగిల్స్ డే ను గుర్తుపెట్టుకొని మరీ.. తన సింగిల్ ఫ్యాన్స్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నాడు.
నేడు సింగిల్స్ అంటే.. ప్రేమ, పెళ్లి లేకుండా ఉన్నవారికి ప్రత్యేకమైన రోజు అంట. అందుకే వారందరికీ హ్యాపీ సింగిల్స్ డే అని శుబాకాంకాంక్షలు తెలుపుతూ పోస్ట్ పెట్టాడు.”ప్రకాశవంతంగా వెలుగుతున్న ప్రతి ఒక్కరినీ విస్మరించాలి… సింగిల్స్ డే శుభాకాంక్షలు” అంటూ ఉదయమే యోగా చేస్తున్నట్లు ఉన్న ఫోటోను షేర్ చేశాడు.
Pushpa Movie trailer update: పుష్ప ట్రైలర్ రిలీజ్ అయ్యేది అప్పుడే, బన్నీ ఫ్యాన్స్ కి పూనకాలే
ఇక ఈ పోస్ట్ కు సింగిల్స్ అసెంబుల్ అయ్యి.. ఒక వర్గానికి నువ్వు ఇన్స్పిరేషన్ బ్రో.. హ్యాపీ సింగిల్స్ డే అంటూ విషెస్ చెప్పుకొస్తున్నారు. అయితే ఇంకోపక్కా అన్నా.,. నువ్వు సింగిల్ కాదంటగా.. హీరోయిన్ తో ప్రేమలో ఉన్నావంటగా అని కామెంట్స్ పెడుతున్నారు. హీరోయిన్ మెహరీన్ తో తేజ్ ప్రేమలో ఉన్నాడని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. వీరిద్దరూ కలిసి జవాన్ సినిమాలో నటించారు. అయితే ఈ వార్తలను తేజ్ కొట్టిపడేశాడు. మరి ఎన్నాళ్ళు తేజ్ ఇలా సింగిల్ గా ఉంటాడో చూడాలి.