Rashmika Mandanna : టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె తో సినిమా తియ్యాలంటే దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇటీవల ఈమె నటించిన ప్రతి మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. దాంతో ఆమె క్రేజ్, రేంజ్ పూర్తిగా పెరిగిపోయింది. ఒకవైపు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. క్రేజ్ పెరిగే కొద్ది ట్రోల్స్ కూడా ఎక్కువ అవుతాయి. సరిగ్గా రష్మికకు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. తాజాగా ఈమెను సపోర్ట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. ఆమె ఎవరు అన్నది తెలుసుకుందాం..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతోంది. భాష పట్టింపులు లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న రష్మిక కర్ణాటకకు చెందిన వ్యక్తి అని అందరికీ తెలుసు.. సొంత రాష్ట్రం వాళ్లే విమర్శలు చేస్తూ నిప్పులు కక్కుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా రష్మికపై తీవ్రంగా ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఆమెకు గట్టిగా బుద్ధి చెప్పాలని అంటూ సంచలనం వ్యాఖ్యలు చేశాడు. అది పెద్ద చర్చనీయాంసంగా మారింది. అయితే రష్మిక చేసిన కొన్ని కామెంట్స్ వల్ల కర్ణాటకలో ఆమెపై ఎవరూ ఊహించని రీతిలో ట్రోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రష్మికపై జరుగుతున్న ట్రోలింగ్ విషయంలో కన్నడ నటి రమ్య స్పందించారు..
సినీ నటి రమ్య గురించి అందరికీ తెలుసు. ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటిగా నటించి ఆ తర్వాత ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉంది.. ఈమె కళ్యాణ్ రామ్ తో కలిసి అభిమన్యు సినిమా చేసింది. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్లీ తెలుగులో కనిపించలేదు.. అయితే కన్నడలో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రష్మిక పై వస్తున్న ట్రోల్స్ పై ఈమె మండిపడింది. రమ్య తాజాగా బెంగుళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైన రమ్య, రష్మిక లాంటి హీరోయిన్లను ట్రోల్ చేయడం మానవత్వం అనిపించుకోదని, ఆడపిల్లలు చాలా సున్నితంగా ఉంటారని… వాళ్లను ఏమన్నా సరే తిరిగి మాట్లాడరు. అమ్మాయిలపై ఇలాంటివి కామన్ గా జరుగుతున్నాయి మనము ఇలాంటి వాటిని ఎదుర్కోవాలి అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పొలిటిషన్ అయ్యింది రష్మికకు సపోర్ట్ చేయడం ఏంటి అంటూ కొందరు కన్నడీలు సోషల్ మీడియా ద్వారా ఆమెను టార్గెట్ చేశారు. రష్మిక నుంచి యు టర్న్ తీసుకొని రమ్యవైపు ట్రోల్స్ పెరిగాయి.. మరి ఇది ఎన్ని చర్చలకు దారితీస్తుందో చూడాలి..
రష్మిక మందన్న సినిమాల విషయానికొస్తే.. గతేడా అది చివర్లో పుష్ప2 సినిమాతో బ్లాక్ బస్టర్ హేడ్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది ఛావా మూవీతో మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పుష్ప 3 కోసం కసరత్తులు చేస్తుంది. అలాగే సికిందర్, యానిమల్ 2 సినిమాల్లో నటిస్తుంది.