OTT Movie : ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఆమె కంటూ ప్రత్యేకమైన కథలు రాస్తూ, సినిమాలు కూడా తీస్తున్నారు. నయనతార తర్వాత అంతలా బిజీ అయిన నటి ఐశ్వర్య రాజేష్. ఈమె నటించిన ఒక తమిళ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను బాగా థ్రిల్ చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ తన స్నేహితురాలి మర్డర్ మిస్టరీని ఛేదించే క్రమంలో షాక్ అయ్యే విషయాలు తెలుసుకుంటుంది. చివరి వరకు సస్పెన్స్ తో ఈ మూవీ పిచ్చెక్కిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
సోనీ లివ్ (SonyLIV) లో
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘తిట్టమ్ ఇరందు’ (Thittam irandu). 2021లో విడుదలైన ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి విఘ్నేష్ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఇది కొరియన్ మూవీ రెయిన్‌బో ఐస్ ఆధారంగా రూపొందించబడింది. దీనిని దినేష్ కన్నన్ సిక్సర్ ఎంటర్‌టైన్‌మెంట్, మినీ స్టూడియోస్ నిర్మించాయి. ఇందులో ఐశ్వర్య రాజేష్, పావెల్ నవగీతన్, సుభాష్ సెల్వం, గోకుల్ ఆనంద్, అనన్య రాంప్రసాద్, మురళీ రాధాకృష్ణన్, సుభాష్ సెల్వం కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ 30 జూలై 2021న ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (SonyLIV) లో విడుదలైంది.
స్టోరీ లోకి వెళితే
అతిర బస్సు ప్రయాణం చేస్తుండగా అర్జున్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. అర్జున్తో అతిర బాగా కలిసిపోతుంది. నిజానికి అతిర ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. ఆమెతో దగ్గర అవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అర్జున్. ఇంతలో అతిర ఫ్రెండ్ అయిన సూర్య చనిపోయిందని తెలుసుకుంటుంది. ఒక కారు ప్రమాదంలో ఆమె చనిపోతుంది. భర్త కిషోర్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తే అతని సైడు నుంచి ఎటువంటి ఆధారాలు లభించవు. కాలేజ్ ఫ్రెండ్స్ ని కూడా విచారిస్తుంది అతిర. అందులో వర్ణ అనే వ్యక్తి మీద అనుమానం వస్తుంది. అతన్ని చాలా కష్టం మీద పట్టుకుంటుంది అతిర. ఆమెను చంపాలనుకున్న మాట వాస్తవమే అని, అయితే నేను చంపేలోగానే ఆమె చనిపోయిందని చెప్తాడు వర్ణ. ఆమెను చంపడానికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో వేరొక వ్యక్తిని చూశానని కూడా చెప్తాడు. తన ప్రేమను నిరాకరించిందని సూర్యని చంపాలనుకుంటాడు వర్ణ. సూర్య పోస్టుమార్టం రిపోర్ట్ తప్పుగా వచ్చిందని తెలుసుకుంటుంది అతిర. డాక్టర్ ని విచారిస్తే భర్త ఇలా చేయమని బెదిరిస్తే చేశానని చెప్తాడు డాక్టర్. భర్తను విచారిస్తే ఆమెకు నేనంటే ఇష్టం లేదని, తనకి వేరొకరితో పెళ్లి జరిపించానని షాక్ ఇస్తాడు. తను ఇక్కడ లేదని ఎప్పుడు వస్తుందో కూడా తెలియదని చెప్తాడు.
అతిర ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. అది కూడా సూర్య మొబైల్ నుంచి మెసేజ్ వస్తుంది. నన్ను కలవాలంటే ఒకచోటికి రావాలని అందులో ఉంటుంది. అక్కడికి అదిరా తో పాటు, అర్జున్ కూడా వెళ్తాడు. అక్కడ సూర్య ఉండదు. అతని భర్త మాత్రమే ఉంటాడు. ఆమె ఎక్కడా అని అదిరా అడుగుతుంది. అప్పుడు ఎదురుగా ఉన్న రాజేష్ నేనే సూర్య అని చెప్తాడు. జరిగిన విషయం తెలిసి అతిరకి దిమ్మ తిరిగిపోతుంది. సూర్య అనే అమ్మాయే ఇప్పుడున్న రాజేష్. చిన్నప్పటినుంచి అదిరా అంటే సూర్యకి చాలా ఇష్టం. వీళ్ళిద్దరూ అమ్మాయిలే కావడంతో, సూర్య మగవాడిగా సర్జరీ చేసుకుంటుంది. చిన్నప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఒకసారి అడిగితే, మగాడివైతే చేసుకుంటానని చెప్పి ఉంటుంది అతిర. ఆ మాటతో ఇలా తయారవుతుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా అని రాజేష్ లా మారిన సూర్య, అతిరను అడుగుతుంది. చివరికి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా? అనే విషయాన్ని ‘తిట్టమ్ ఇరందు’ (Thittam irandu) మూవీని చూసి తెలుసుకోండి.