OTT Movie : పిల్లా జెల్లాతో కలిసి ఫ్యామిలీ అంతా చూడదగ్గ బెస్ట్ ఓటీటీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఇందులో ఒక సరదా ఫ్యామిలీ యాక్షన్ అడ్వెంచర్ కథను చెప్పుకోబోతున్నాము. పిల్లలు హీరోలుగా మెరిసే ఈ సినిమా వర్త్ వాచింగ్ అన్పిస్తుంది. కూల్ గాడ్జెట్స్, జెట్ ప్యాక్‌లు, అదృశ్య క్లాక్‌లు, రోబో హెలికాప్టర్‌లు సినిమాలో ఒక ఫన్ స్పై వైబ్‌ను ఇస్తాయి. అంతేకాదు ఇందులో ఎమోషన్స్ కూడా ఉంటాయి. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
కథలోకి వెళ్తే…
కార్మెన్ కోర్టెజ్, జూని కోర్టెజ్ అనే సిస్టర్ అండ్ బ్రదర్ సాధారణ జీవితం గడుపుతున్నామని భావిస్తారు. కానీ వారి తల్లిదండ్రులు గ్రెగోరియో, ఇంగ్రిడ్ కోర్టెజ్ నిజానికి OSS (Organization of Super Spies)కి చెందిన సీక్రెట్ స్పైలు. ఒక రోజు గ్రెగోరియో, ఇంగ్రిడ్ ఒక మిషన్ లో కన్పించకుండా పోతారు. తరువాత వాళ్ళు ఇద్దరూ ఫ్లాక్ ఫ్లిమ్ అనే టెక్ జీనియస్, అతని యజమాని మిస్టర్ లిస్ప్ చేతిలో చిక్కుకున్నారని తెలుస్తుంది. లిస్ప్ ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ ను నడుపుతాడు. ఇందులో ఫ్లాక్ ఫ్లిమ్ “Thumb-Thumbs” అనే రోబోలను, “Fooglies” అనే వింత జీవులను సృష్టిస్తాడు. అలాగే పిల్లల బుద్ధిని ఉపయోగించి ప్రపంచాన్ని ఆకర్షించే ఒక టీవీ షోను రూపొందిస్తాడు. కానీ అతని నిజమైన లక్ష్యం ప్రపంచాన్ని నియంత్రించడం.
ఈ నేపథ్యంలోనే కార్మెన్, జూని తమ తల్లిదండ్రులు గూఢచారులని తెలుసుకుని, వారిని రక్షించడానికి స్వయంగా తామే గూఢచారులుగా మారాలని డిసైడ్ అవుతారు. తమ అంకుల్ ఫెలిక్స్ సహాయంతో కార్మెన్, జూని OSS నుండి అత్యాధునిక గాడ్జెట్స్, ట్‌ప్యాక్‌లు, స్పై వాచ్ లు, రబ్బర్ బూట్లు వంటివి సంపాదిస్తారు. ఒక హై-టెక్ సబ్‌మెర్సిబుల్ లో సముద్ర లోతుల్లోని ఫ్లాక్ ఫ్లిమ్ రహస్య ద్వీప కోటకు వెళతారు. ఈ ప్రయాణంలో వారు Thumb-Thumbsతో యుద్ధం చేస్తారు. ఫ్లాక్ ఫ్లిమ్ వింత జీవులను కూడా ఎదుర్కొంటారు. మరి చివరికి ఈ పిల్ల పిడుగులు తమ తల్లిదండ్రులను కనిపెట్టగలిగారా ? ఫ్లాక్ ఫ్లిమ్ ను ఎలా ఎదుర్కొన్నారు? చివరికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను వీక్షించాల్సిందే.
Read Also : అమాయకుడిని చంపి అడ్డంగా బుక్కయ్యే ఫ్రెండ్స్… రివేంజ్ డ్రామా అంటే ఈ రేంజ్ లో బ్లడ్ బాత్ ఉండాల్సిందే
నాలుగు ఓటీటీలో స్ట్రీమింగ్
“Spy Kids” మూవీ 2001లో రిలీజ్ అయ్యింది. రాబర్ట్ రోడ్రిగ్జ్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ-ఫ్రెండ్లీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చిన్న పిల్లలకు బాగా నచ్చుతుంది. అలాగే స్పై యాక్షన్ సినిమాలంటే ఇష్టపడే పెద్దలు కూడా ఈ మూవీని సరదాగా చూడవచ్చు. ఇందులో అలెక్సా వేగా, డారిల్ సబరా, ఆంటోనియో బాండెరాస్, కార్లా గుగినో, అలాన్ కమ్మింగ్, టోనీ షల్హౌబ్, టెరీ హాచర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ కామెడీ ఫ్యామిలీ డ్రామా 1 గంట 28 నిమిషాలు ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీ నాలుగు ఓటీటీలలో అందుబాటులో ఉంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, ఆపిల్ టీవీ ఓటీటీలలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమా విజయం మూడు సీక్వెల్స్ (Spy Kids 2: The Island of Lost Dreams, Spy Kids 3-D: Game Over, Spy Kids: All the Time in the World), 2018లో ఒక యానిమేటెడ్ సిరీస్‌కు దారితీసింది. 35 మిలియన్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 147 మిలియన్లు వసూలు చేసి భారీ విజయం సాధించింది.