OTT Movie : సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలు గ్రిప్పింగ్ స్టోరీతో ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తాయి. ఆడియన్స్ ను మొదటి నుంచి చివరి వరకూ ఎంగేజ్ చేయగల జానర్లలో సై-ఫై కూడా ఒకటి. అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఆద్యంతం అబ్బురపరిచేలా ఉంటాయి ఇలాంటి సినిమాలు. అలాంటి సినిమాలంటే పిచ్చిగా ఇష్టపడే వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఇందులో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ప్రపంచం ఎలా అంతం అవుతుంది? గ్రహాంతర వాసుల దాడి వంటి అంశాలు ఉంటాయి. ఇక ఈ మూవీ కథపై ఓ లుక్కేద్దాం పదండి.
కథలోకి వెళ్తే…
రే ఫెర్రియర్ (టామ్ క్రూజ్) న్యూజెర్సీలో ఒక డాక్ వర్కర్. భార్యతో విడాకులు తీసుకున్న ఆయన తన ఇద్దరు పిల్లలు రాచెల్ (డకోటా ఫానింగ్), రాబీ (జస్టిన్ చాట్విన్)కి దూరంగా ఉండాల్సి వస్తుంది. వీకెండ్ లో మాత్రం అతని మాజీ భార్య (మిరాండా ఒట్టో) పిల్లలను రే దగ్గర వదిలి వెళుతుంది. అలా ఓ వారం పిల్లల్ని మాజీ భర్త దగ్గర వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఆకాశంలో వింత విద్యుత్ తుఫానులు కనిపిస్తాయి, భూమిపై అసాధారణ సంఘటనలు జరగడం మొదలవుతాయి.
ఈ తుఫానుల తర్వాత భూమి లోపల నుండి మూడు కాళ్ళు ఉన్న భారీ యంత్రాలు ట్రైపాడ్స్ బయటకు వస్తాయి. ఇవి గ్రహాంతర జాతికి చెందినవి, మానవులను నాశనం చేయడానికి అవి పవర్ ఫుల్ హీట్-రే ఆయుధాలను ఉపయోగిస్తాయి. రే తన పిల్లలతో కలిసి ఈ ట్రైపాడ్స్ దాడి నుండి తప్పించుకోవడానికి అక్కడి నుండి సేఫ్ ప్లేస్ కు పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అందరూ కలిసి ఒక కారులో ప్రయాణిస్తూ… నాశనమైన నగరాలు, గందరగోళంలో ఉన్న జనాలను చూస్తారు. అలాగే ట్రైపాడ్స్ దాడులను ఎదుర్కొంటారు.
రే తన పిల్లలు రాచెల్, రాబీలతో కలిసి మాజీ భార్య ఉండే బోస్టన్‌కు చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయాణంలో రాబీ కోపంతో గ్రహాంతరవాసులతో పోరాడడానికి సైన్యంలో చేరాలని డిసైడ్ అవుతాడు, ఈ క్రమంలో రే, రాచెల్ ఒక గ్రామంలో హార్లన్ ఒగిల్వీ అనే వ్యక్తి దగ్గర ఆశ్రయం పొందుతారు. హార్లన్ ట్రైపాడ్స్ ను ఎదిరించాలని ప్లాన్ చేస్తాడు. కానీ అతను పిచ్చోడిలా మారిపోతాడు. కాగా ట్రైపాడ్స్ మానవ రక్తాన్ని సేకరించి, భూమిని తమ గ్రహంలా మార్చడానికి ఒక ఎర్రటి మొక్కను నాటుతున్నారని తెలుస్తుంది.
ఇంతలో ఒక ట్రైపాడ్ రాచెల్ ను బంధిస్తుంది. కానీ రే ఆమెను రక్షించడానికి తన ప్రాణాలను పణంగా పెట్టి ట్రైపాడ్‌లోకి చేరతాడు. అతను గ్రనేడ్‌లను ఉపయోగించి ట్రైపాడ్‌ను ధ్వంసం చేసి, రాచెల్‌తో తప్పించుకుంటాడు. చివరకు రే, రాచెల్ బోస్టన్‌కు చేరుకుంటారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆ ట్రైపాడ్స్ ఎలా నాశనం అయ్యాయి? చివరికి ఏం జరిగింది? అనేది తెరపై చూడాల్సిందే.
Read also : మనుషుల్ని మటన్ లా వండుకుని తినే రిచ్ పీపుల్… ఈ యవ్వారం ఏదో తేడాగా ఉందేంటి భయ్యా ?
ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ ?
స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో వచ్చిన “War of the Worlds” మూవీ 2005లో రిలీజ్ అయ్యింది. H.G. వెల్స్ క్లాసిక్ నవల ఆధారంగా రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ లో టామ్ క్రూజ్ హీరోగా నటించాడు. ఈ మూవీ ఇప్పుడు జియో సినిమా (Jio Cinema), నెట్ ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆపిల్ టీవీ (Apple TV)లలో అందుబాటులో ఉంది.