Zebra Movie : ముందుగా చిన్న చిన్న పాత్రలో కనిపించిన సత్యదేవ్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతి లక్ష్మి సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఆ సినిమా తర్వాత కొన్ని కీలక పాత్రలో మాత్రమే కనిపిస్తూ హీరోగా కూడా సినిమాలు చేశాడు. గోపి గణేష్ దర్శకత్వంలో వచ్చిన బ్లఫ్ మాస్టర్ సినిమా అప్పట్లో మంచి హిట్ అయింది. అయితే ఈ సినిమాకి మంచి టాక్ వచ్చినా కూడా ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయింది. ఇప్పటికే ఆ సినిమా విషయంలో బాధపడుతూ ఉంటాడు సత్యదేవ్. ఆ సినిమాలు సత్యదేవ్ క్యారెక్టర్జేషన్ చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు దర్శకుడు గోపి గణేష్. ఇక తర్వాత సత్యదేవ్ నటించిన సినిమాలేవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ ను సాధించలేకపోయాయి.
ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే విలన్ గా కూడా నటించాడు సత్య. మోహన్ రాజా దర్శకత్వం వహించిన గాడ్ ఫాదర్ సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమాలో ఏకంగా చిరంజీవికి ప్రతి నాయకుడు పాత్రను పోషించాడు సత్య. సత్య మొదట ఈ విలన్ రోల్ గురించి ఆలోచిస్తున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి తనను పిలిచి సత్య నువ్వు రోల్ చేయడం వలన ఇంకో పదిమందికి తెలుస్తావు. దానివల్ల నీకు అవకాశాలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి పక్కన అవకాశం వస్తే ఎవరు కాదనుకుంటారు అని ఇంటెన్షన్ తో ఆ సినిమాను కూడా చేసేసాడు సత్యదేవ్. ఆ సినిమా సత్యదేవ్ కి మంచి పేరుని తీసుకొచ్చింది.
Also Read : Vijay Sethupathi: నా సినిమా గురించే మాట్లాడండి… ఆ సినిమాతో నాకేం సంబంధం
ఇక రీసెంట్గా సత్యదేవ్ నటించిన సినిమా జీబ్రా. ఈ సినిమా మీద సత్యదేవ్ విపరీతమైన నమ్మకంతో ఉండేవాడు. బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయిన ఆ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. బ్లఫ్ మాస్టర్ సినిమాలా కాకుండా ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించాలి అనే ఉద్దేశంతో విపరీతంగా ఆ సినిమాను ప్రమోట్ చేశాడు సత్యదేవ్. ఇక ఆ సినిమాకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ప్రస్తుతం ఆ సినిమా డిసెంబర్ 24 ఓటీటీ లో విడుదల కానుంది ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ప్రెస్ మీట్ లో సత్యదేవ్ మాట్లాడుతూ ఈ సినిమా వచ్చిన కొన్ని రివ్యూస్ వలన రావాల్సిన కంప్లీట్ కమర్షియల్ సక్సెస్ ఆగిపోయింది అంటూ చెప్పుకొచ్చారు సత్యదేవ్. మామూలుగా బాగుండే సినిమాలు కి రివ్యూస్ ప్లస్ అవుతాయి. ఇంకొన్ని సినిమాలకి అవే రివ్యూలు మైనస్ అవుతాయి. ఇక ఈ సినిమాకి ఓటీటీ లో ఏ మేరకు రెస్పాన్స్ లభిస్తుందో వేచి చూడాలి. అయితే కొంతమంది మాత్రం థియేటర్ లో మిస్సయిన సినిమాని ఓటీటీ లో చూస్తూ, ఇంత గొప్ప సినిమాను థియేటర్లో ఎలా మిస్ అయ్యామంటూ పోస్టులు పెడుతుంటారు.
Also Read : Mega Family: అభిమానం కోసం అలాంటి పని చేసిన తండ్రీకొడుకులు.. నిజంగా గ్రేట్ కదా..!