BigTV English

TG Intermediate Exams Schedule 2025: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

TG Intermediate Exams Schedule 2025: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

TG Intermediate Exams Schedule 2025: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షల షెడ్యూల్‌ను ‘తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్’ సోమవారం ప్రకటించింది. ఇంటర్మీడియెట్ మొదటి, రెండవ సంవత్సరం (జనరల్, వొకేషనల్) పరీక్షలను మార్చి 2025లో నిర్వహిస్తామని తెలిపింది. ఈ మేరకు టైమ్‌ టేబుల్‌ను విడుదల చేసింది. జనవరి 29న ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్ పరీక్ష (బ్యాక్‌లాగ్ విద్యార్థులకు మాత్రమే), జనవరి 30న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్టు తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది.


జనరల్, వొకేషనల్ కోర్సుల విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ ఎగ్జామ్‌ జనవరి 31న ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు, ఫిబ్రవరి 1న సెకండ్ ఇయర్ విద్యార్థులకు నిర్వహించనున్నట్టు బోర్ట్ వెల్లడించింది. ఇక ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ను జనరల్, వొకేషనల్ కోర్సుల విద్యార్థులకు ఫిబ్రవరి 3-22 వరకు నిర్వహించనున్నట్టు తెలిపింది. ప్రాక్టికల్స్ ఉదయం 9-12 గంటల వరకు, మధ్యాహ్నం 2-5 గంటల వరకు రెండు సెషన్లలో జరుగుతాయని, సెకండ్ శనివారం, ఆదివారాల్లో కూడా ప్రాక్టికల్స్ ఉంటాయని పేర్కొంది. ఇక థియర్ పరీక్షలు అన్నీ ఉదయం 9 గంటలకు మొదలై 12 గంటల వరకు కొనసాగుతాయని వివరించింది.

ఇంటర్ ఫస్టియర్..
⦿ సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1 05-30-2025
⦿ ఇంగ్లిష్ పేపర్-1 07-03-2025
⦿ మ్యాథ్స్ పేపర్-1ఏ, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1 11-03-2025
⦿ మ్యాథ్స్ పేపర్-2బీ, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1 13-03-2025
⦿ ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1 17-03-2025
⦿ కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1 19-03-2025
⦿ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-1(బైపీసీ విద్యార్థులకు) – 21-03-2025
⦿ మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1 24-03-2025


ఇంటర్ సెకండియర్..
⦿ సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 06-03-2025
⦿ ఇంగ్లిష్ పేపర్-2 10-3-2025
⦿ మ్యాథ్స్ పేపర్-2ఏ, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2 12-03-2025
⦿ మ్యాథ్స్ పేపర్-2బీ, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2 15-03-2025
⦿ ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2 18-03-2025
⦿ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్-2(బైపీసీ విద్యార్థులకు) 22-03-2025
⦿ మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2 25-03-2025.

TG Intermediate Exams Schedule 2025
TG Intermediate Exams Schedule 2025

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×