BigTV English

Vijay Sethupathi: నా సినిమా గురించే మాట్లాడండి… ఆ సినిమాతో నాకేం సంబంధం

Vijay Sethupathi: నా సినిమా గురించే మాట్లాడండి… ఆ సినిమాతో నాకేం సంబంధం

Vijay Sethupathi : విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటిస్తున్న సినిమా విడుదల 2. వెట్రి మారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ అద్భుతమైన రెస్పాన్స్ ను సాధించింది. దానికి సీక్వెల్ గా ఇప్పుడు సెకండ్ పార్ట్ సిద్ధమైంది. ఈ సెకండ్ పార్ట్ డిసెంబర్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది. విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ సేతుపతి నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతూ రిలీజ్ అయ్యాయి. అలానే విజయ్ సేతుపతి సినిమాలను తమిళ్లో చూసి మరి అభిమానించిన అభిమానులు కూడా ఉన్నారు అని చెప్పాలి. తెలుగు ప్రేక్షకులు ఒక గొప్ప సినిమా ఏ భాషలో ఉన్నా కూడా దానిని ఆదరించడంలో ముందుంటారు అనేది నిరూపించబడుతూ వచ్చింది.


ఇక ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో పాన్ ఇండియా సినిమాలు తెలుగు నుంచి వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంటున్నాయి. ఇంకా రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా ఇప్పటికే దాదాపు 1000కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా 2000 కోట్లు వసూలు చేస్తుంది అనడంలో సందేహం కూడా లేదు. తెలుగులో వస్తున్న పాన్ ఇండియా సినిమాలను చూసి తమిళ్ లో కూడా ఆ స్థాయి సినిమాను చేయాలని ప్రయత్నాలు చేశారు కొంతమంది దర్శకులు. మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ కొంతమేరకు పరవాలేదు అనిపించుకుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సినిమా కంగువ. ఈ సినిమా తమిళ బాహుబలి అవుతుంది అని నిర్మాత జ్ఞానవేల్ రాజా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ సినిమా 2000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేస్తుందని కూడా తెలిపారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించని డిజాస్టర్ గా మిగిలిపోయింది.

Also Read : Laila : వాలెంటైన్స్ డేను టార్గెట్ చేసిన విశ్వక్ సేన్


ఇక ప్రస్తుతం విడుదల సినిమా ప్రమోషన్స్ కి తెలుగులో ఇంటర్వ్యూ ఇస్తున్నారు విజయ్ సేతుపతి. ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలు విజయ్ సేతుపతి తన అసహనాన్ని వ్యక్తపరిచారు. కంగువ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు, నేను ఇక్కడికి విడుదల సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చాను ఆ సినిమా గురించి నేను ఎందుకు మాట్లాడుతాను. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా మొదలు పెడతారు. చిన్న హోటల్ బిజినెస్ పెట్టినా కూడా సక్సెస్ అవుతామని అనుకుంటారు. నా సినిమా ఫెయిల్ అయినప్పుడు కూడా నన్ను ట్రోల్ చేస్తూ ఉంటారు. అంటూ విజయ సేతుపతి తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చాడు. ఆ తర్వాత చాలా ఇంటర్వ్యూస్ కూడా విజయ్ సేతుపతి రిజెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read : Pushpa 2: సోషల్ మీడియాను మొత్తం షేక్ చేసిన పీలింగ్స్ వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్..

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×