Drugs raid: ఫిలిం ఇండస్ట్రీలో ఈ డ్రగ్స్ వ్యవహారం ఎంతలా సంచలనం సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డ్రగ్స్ వాడకం నిషిద్ధమని, ఎంతమంది అధికారులు చెప్పినా సరే వినడం లేదు. ముఖ్యంగా పబ్బులు, పార్టీలు పేరిట ఈ డ్రగ్స్ వాడుతూ మనుషులు కాస్త మృగాలుగా మారిపోతున్నారు. ఇదిలా ఉండగా ఒక హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ హోటల్ పై డ్రగ్స్ రైడ్ నిర్వహించగా.. ఉలిక్కిపడ్డ నటుడు ఏకంగా హోటల్లోని మూడవ అంతస్తు నుండి దూకి పరారయ్యాడు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో.. కొచ్చి హోటల్లో డ్రగ్స్ రైడ్ సమయంలో పోలీసుల నుంచి పారిపోయాడు. మూడో అంతస్తు నుంచి స్విమ్మింగ్ పూల్ లోకి దూకి తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇకపోతే గతంలో నటి విన్సీ అలోషియస్.. షైన్ డ్రగ్స్ సేవించి సెట్లో ఇబ్బంది పెట్టాడు అని ఫిర్యాదు చేయగా.. దీనిపై AMMA విచారణ కమిటీని నియమించింది. అయితే 2015లో కొకైన్ కేసులో షైన్ నిర్దోషిగా విడుదలైన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఇలా డ్రగ్స్ రైడ్ నిర్వహించగా అక్కడి నుంచి పారిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో షైన్ టామ్ చాకో పై నటి ఫిర్యాదు..
ప్రముఖం మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ ఒక సినిమా సెట్ లో షైన్ టామ్ చాకో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది. అయితే ఆమె హీరో పేరు బహిరంగంగా బయట పెట్టకపోయినా AMMA లో ఫిర్యాదు తర్వాత ఆయన పేరు కాస్త బయటకు వచ్చింది. ఇకపోతే గతంలో విన్సీ ‘సుత్రవాక్యం’ అనే సినిమా సెట్ లో ఉన్నప్పుడు షైన్ డ్రగ్స్ సేవించి, తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె ఒక వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అంతగా తెలియని వ్యక్తితో నటించడం , అతనితో కలిసి పనిచేయడం తనకు ఆసక్తి లేదని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక ఈ విషయాలను ఆమె గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు షైన్ డ్రగ్స్ రైడ్ నుంచి తప్పించుకోవడంతో ఈ విషయాలు కాస్త మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
షైన్ టైమ్ చాకో సినిమాలు..
ఇక షైన్ టైమ్ చాకో విషయానికి వస్తే.. తెలుగు, తమిళ్, మలయాళం చిత్రాలలో నటుడిగా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ లో శ్రీకాంత్ ఓదెలాv(Srikanth odala)దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని (Nani ) హీరోగా నటించిన ‘దసరా’ సినిమా ద్వారా విలన్ గా అడుగుపెట్టాడు. ముఖ్యంగా ఈ సినిమాలో ఈయన నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇక తర్వాత రంగబలి, దేవర, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ వంటి చిత్రాలలో నటించారు. ఇక ఇన్ని అద్భుతమైన చిత్రాలలో అవకాశాలు వస్తున్న సమయంలో ఇలా షైన్ పై డ్రగ్స్ ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.