Pooja Hegde : ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఏం చేసినా సరే సెన్సేషన్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మిగతా విషయాలను కాస్త పక్కన పెడితే, ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో హీరోయిన్స్ ఎప్పుడూ కూడా అంత యాక్టివ్ గా ఉండరు. అయితే అందరూ అలా కాదు కానీ.. ప్రత్యేకించి కొంతమంది స్టార్ హీరోయిన్స్ మాత్రం ఇలా ప్రమోషన్స్ విషయంలో కేవలం ఒకటి, రెండు ఈవెంట్లకు మాత్రమే హాజరవుతూ.. మిగతా వాటి నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ పర్టికులర్ గా ఒకటి లేదా రెండు సినిమాలకు మాత్రం గట్టిగా ప్రమోషన్స్ చేస్తే మాత్రం అనుమానాలు వ్యక్తమవుతాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు బుట్ట బొమ్మగా పేరు సొంతం చేసుకున్న పూజా హెగ్డే (Pooja Hegde)కూడా ఒక సినిమా కోసం ప్రమోషన్స్ లో దూకుడు చూపించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రెట్రో మూవీ కోసం ప్రమోషన్స్ జోరు పెంచిన పూజా హెగ్డే..
అసలు విషయంలోకి వెళ్తే పూజా హెగ్డే ఇప్పటికే ఇటు టాలీవుడ్, కోలీవుడ్ తో పాటూ.. అటు బాలీవుడ్ లో కూడా ఎన్నో చిత్రాలు చేసింది. కానీ ఏ సినిమా కోసం కూడా ఇంతలా ఈమె ఎఫర్ట్ పెట్టలేదు. కానీ తాజాగా ఈమె సూర్య రెట్రో మూవీ కోసం చేస్తున్న ప్రమోషన్స్ చూసి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ మొదలుకొని ప్రతి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో కూడా సూర్య రెట్రో మూవీని జోరుగా ప్రమోట్ చేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. సూర్య హీరోగా.. సూర్యా సరసన పూజా హెగ్డే ఈ చిత్రంలో నటిస్తోంది. ఇక నిన్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేయగా.. ఈ ట్రైలర్ కూడా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో పూజ హెగ్డే డి గ్లామరస్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. మే 1వ తేదీన సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అటు హీరో సూర్య కంటే కూడా ఇటు పూజ హెగ్డే ప్రమోషన్స్ లో దూకుడు పెంచేసింది. సోషల్ మీడియా ప్రమోషన్స్ తో పాటు ఇటు బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ అందరిలో అనుమానాలు పెంచేసింది.
సినిమా కోసం కాదా.. వ్యక్తి కోసమా..?
ఇకపోతే పూజా గతంలో కూడా ఇలా ఎన్నో సినిమాలు చేసింది. కానీ ఈ రేంజ్ లో ప్రమోషన్స్ ఏ సినిమాకి చేయలేదు. ఇప్పుడు ఈ రెట్రో మూవీ కోసం ఈమె దూకుడు చూసి పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక దీనంతటికీ కారణం ఒక ప్రొడ్యూసర్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో సమంత (Samantha ) కూడా ఇలాగే ఒక సినిమా కోసం కాకుండా ఒక ప్రొడ్యూసర్ కోసం ప్రమోషన్స్ చేసింది అనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు పూజా హెగ్డే కూడా తన సినిమా కోసం కాకుండా ఒక వ్యక్తి కోసం చాలా దూకుడుగా ప్రమోషన్స్ చేస్తోందని మళ్లీ వార్తలు వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనా అప్పుడు సమంత ఇప్పుడు పూజ హెగ్డే ..ఇలా సినిమాల కోసం కాకుండా ఒక వ్యక్తి కోసం ప్రమోషన్స్ జోరుగా చేపట్టడంపై పలు రకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి దీనిపై పూజా హెగ్డే ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.
రెట్రో సినిమా విశేషాలు..
ఇక సూర్య రెట్రో మూవీ విషయానికి వస్తే.. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో మే ఒకటవ తేదీన థియేటర్లలోకి రాబోతోంది. నిన్న విడుదల చేసిన ట్రైలర్ ని బట్టి చూస్తే సినిమా స్టోరీ రివీల్ చేయలేదు కానీ లవ్, యాక్షన్, వయలెన్స్ కలగలిసిన మూవీగా ఈ సినిమా రాబోతోందని అయితే స్పష్టం అవుతుంది. ఇందులో పూజా హెగ్డే, సూర్యతో పాటు జోజు జార్జ్ , ప్రకాష్ రాజ్ , జయరాం, కరుణాకరన్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.