Sai Dhansika.. సాయి ధన్సిక (Sai Dhansika).. విశాల్.(vishal ) కాబోయే భార్యగా ఇప్పుడు మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ‘యోగిదా’ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్లో ప్రకటించారు కూడా. దీంతో ఈ జంటకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉండగా విశాల్ కు కాబోయే భార్యను ఒక స్టార్ హీరో తండ్రి అవమానించారట. దాంతో స్టేజ్ పైన ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతకు ఆ ఘటన ఎప్పుడు జరిగింది? అసలేమైంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
అందరి ముందే సాయి ధన్సికకు ఘోర అవమానం..
కోలీవుడ్లో నటుడిగా , దర్శకుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న టి.రాజేందర్ (T.Rajender). ఈయన ఎవరో కాదు ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో శింబు(Simbu )తండ్రి కూడా. ఒకానొక సందర్భంలో సాయి ధన్సిక పై ఆయన చేసిన కామెంట్లు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. సాయి ధన్సిక పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆమె స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుంది. 2017లో ‘విజితిరు’ అనే సినిమా రిలీజ్ అవ్వగా.. ఈ సినిమాలో కృష్ణ, విధర్త్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇదే సినిమాలో సాయి ధన్సిక, టి. రాజేందర్ కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రెస్ మీట్ లో భాగంగా రాజేందర్ చేసిన కామెంట్లు చర్చకు దారితీసాయి .
స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న సాయి ధన్సిక..
ఇకపోతే ఆ ప్రెస్ మీట్ లో సాయి ధన్సిక మాట్లాడుతూ.. “స్టేజ్ పై ఉన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఆ సమయంలో టి.రాజేందర్ పేరును ఆమె మర్చిపోయింది. దీంతో ఆయన స్టేజ్ పైనే ఆమెను ఇష్టం వచ్చినట్లు తిట్టేశాడు. అదే సమయంలో ఆమె రజినీకాంత్ (Rajinikanth) కబాలి(Kabali ) సినిమా కూడా చేస్తోంది. పెద్ద సినిమాలో నటిస్తున్నానని ఆమెకు బాగా పొగరు పట్టింది అంటూ పొట్టు పొట్టు ఆమెను తిట్టేశాడు రాజేందర్. దీంతో ఆమె వెంటనే తాను టీ. రాజేందర్ ను గౌరవిస్తాను. కానీ పొరపాటున మరిచిపోయాను అని క్షమాపణలు కూడా చెప్పింది. కానీ ఆయన ఆగలేదు. ఆమె శారీ కట్టుకోలేదు కానీ సారీ చెబుతోంది అంటూ సెటైర్లు వేశాడు. దీంతో స్టేజ్ పై ఉన్న వారందరూ టి రాజేందర్ చేసిన కామెంట్లకు చప్పట్లు కొట్టడంతో అవమానంగా భావించిన సాయి ధన్సిక స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చేసింది.
సాయి ధన్సికకి అండగా విశాల్..
అయితే ఆ సమయంలో టి.రాజేందర్ చేసిన వ్యాఖ్యలను విశాల్ ఖండించారు. ఆమెకు అండగా నిలిచారు. ధన్సికా క్షమాపణలు చెప్పినా.. మిస్టర్ టి రాజేందర్ ఆమెను లక్ష్యంగా చేసుకొని తిట్టడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ ఆయన తెలిపారు. అయితే క్షమాపణలు కోరినా.. ధన్సికను టి.రాజేందర్ తిట్టడంపై నెటిజెన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక అమ్మాయితో ఇలాగేనా మాట్లాడేది.. ఎప్పటికి నేర్చుకుంటారో ఏమో అంటూ టి.రాజేందర్ పై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Tollywood: టాలీవుడ్ ని ఏలేస్తున్న ఈ అక్కతమ్ముళ్లను గుర్తుపట్టారా..?