BigTV English

Tollywood: టాలీవుడ్ ని ఏలేస్తున్న ఈ అక్కతమ్ముళ్లను గుర్తుపట్టారా..?

Tollywood: టాలీవుడ్ ని ఏలేస్తున్న ఈ అక్కతమ్ముళ్లను గుర్తుపట్టారా..?

Tollywood: తాజాగా పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు అక్క తమ్ముళ్లు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఏలేస్తున్నారని మీకు తెలుసా.? మరి ఈ అక్కా తమ్ముళ్లు ఎవరు? వీరు ఎవరో మీరు గుర్తుపట్టారా? మరి వారెవరు? ఇండస్ట్రీలో ఏ పొజిషన్లో ఉన్నారో? ఇప్పుడు చూద్దాం. సాధారణంగా సెలబ్రిటీలు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు మాత్రమే తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక హీరో ఈ చిన్నప్పటి ఫోటోని షేర్ చేసి, తన అక్కకు బర్తడే విషెస్ చాలా ప్రత్యేకంగా తెలియజేశారు.


పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారులను గుర్తుపట్టారా..?

మరి వీరెవరో కాదు నాచురల్ స్టార్ నాని (Nani )అలాగే ఆయన అక్క దీప్తి(Deepti). ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి వరుస సినిమాలతో విజయాలు అందుకుని, ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయారు నాని. అంతేకాదు వరుసగా సినిమాలు చేస్తూ తన సినిమాలతో రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తూ ప్రేక్షకులలో తన సినిమాలపై అంచనాలు పెంచేస్తున్నారు. ముఖ్యంగా తన ప్రతి సినిమాకి రేంజ్ పెంచుకుంటూ పోతున్న నాని ఇంకొక వైపు నిర్మాతగా మారి మంచి మంచి సినిమాలను నిర్మిస్తూ కొత్త వాళ్లకి కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఇక మరొకవైపు నాని అక్క దీప్తి దర్శకురాలిగా ‘మీట్ క్యూట్’ అనే ఓటీటీ మూవీని తెరకెక్కించింది. అంతేకాదు నాని నిర్మాణ సంస్థలో బాధ్యతలు కూడా నిర్వర్తిస్తుంది. భవిష్యత్తులో మరో సినిమా కూడా చేస్తాను అని తెలిపింది దీప్తి. ఇలా ఈ అక్కా తమ్ముళ్లు ఇద్దరు కూడా సినీ పరిశ్రమను ఏలేస్తున్నారని చెప్పవచ్చు. ఇకపోతే ఈరోజు దీప్తి పుట్టినరోజు కావడంతో నాని తమ చిన్ననాటి ఫోటోని తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ తన అక్కకి స్పెషల్ బర్తడే విషెస్ తెలియజేశారు. మొత్తానికైతే ఈ అక్కా తమ్ముళ్ల ఫోటో చూసి నెటిజన్స్ భలే క్యూట్ గా ఉన్నారే అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ALSO READ:Allu Arjun: బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలో ఆ లవ్ స్టోరీకి సీక్వెల్..

నాని సినిమాలు..

నాని సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల నిర్మాతగా ‘కోర్ట్’ మూవీ నిర్మించి, భారీ సక్సెస్ అందుకున్న నాని.. ఇప్పుడు ‘హిట్ 3’ సినిమాతో హీరోగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు ఇటీవలే విడుదలైన ఈ సినిమా నానికి ఊహించని ఇమేజ్ తెచ్చి పెట్టింది. అంతేకాదు మునుపెన్నడు చూడని విధంగా నానిని అత్యంత క్రూరంగా ఈ సినిమాలో చూపించారు డైరెక్టర్ శైలేష్ కొలను.ఇక ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) నాని సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఎస్ ఎల్ వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి (Sudhakuri cherukuri) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను ముందుగానే నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోవడానికి ఒప్పందం కూడా తీసుకున్నట్లు సమాచారం. ఇక వచ్చే ఏడాది మార్చి 26న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×