BigTV English

Simbu: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అప్‌డేట్ ఇచ్చిన శింబు

Simbu: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అప్‌డేట్ ఇచ్చిన శింబు

Simbu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా నటిస్తున్న చిత్రం ఓజి, సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ ఈ సినిమా లోఒక పాటను శింబు పాడనున్నట్లు తెలిపారు. అయితే తాజాగా ఈరోజు శింబు, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ను హైదరాబాదులో నిర్వహించారు. అందులోభాగంగా హీరో శింబు ఓజి సినిమా అప్డేట్ ను ప్రేక్షకులకు అందించారు. ఆ వివరాలు చూద్దాం..


పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అప్‌డేట్..

కమలహాసన్, శింబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం థగ్ లైఫ్ . ఇటీవల మూవీ టీం ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను పెంచేసింది. జూన్ 5న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి, త్రిష గౌతమ్ కార్తీక్, దుల్హర్ సల్మాన్, జయం రవి, నాజర్, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మూవీ టీం హైదరాబాదులో ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ ను నిర్వహించారు. అందులో శింబు మాట్లాడుతూ.. ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్.. నా కెరియర్ మొదట్లో మన్మధ సినిమా ను మీరు ఎంతో ఆదరించారు. కొంతకాలం గ్యాప్ తీసుకుని మళ్లీ థగ్ లైఫ్ మూవీతో మీ ముందుకు రానున్నాను. మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ తో నటించిన ఎంతో సంతోషంగా ఉంది. ఇక ఓజి సినిమా సాంగ్ త్వరలో మీ ముందుకు రానుంది. తమన్ మంచి మ్యూజిక్ ని అందించారు. పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ పాట పాడాలని నా డ్రీమ్ ని ఈ సినిమాతో తీర్చుకున్నాను.. త్వరలోనే ఓజి సినిమాలో నేను పాడిన పాట రిలీజ్ అవుతుంది. అని శింబు తెలిపారు. ఈ వీడియో చూసిన పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు.


ఓజి షూటింగ్ త్వరలో ప్రారంభం ..

ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేసి, ఓజి సినిమాపై దృష్టి పెట్టారు. రేపటి నుంచి ఓజి సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభం కానుంది. శనివారం నుండి పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఓజి సినిమా ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఓ గ్యాంగ్స్టర్ మూవీ. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓజెస్ గంభీర అనే రౌడీ డాన్ పాత్రలో నటించనున్నారు. ఆయన పది సంవత్సరాల తర్వాత ముంబైకి తిరిగి వచ్చి తన ప్రత్యర్థి పై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. వీరిద్దరి చుట్టూ కద నడుస్తుంది.ఇక ఈ సినిమా త్వరలోనే సాంగ్ రిలీజ్ అవుతుంది అంటూ శింబు ఇచ్చిన హింటుతో ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాపై మరిన్ని అప్డేట్స్ ఇచ్చేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×