Viral Video: కూటి కోసం కోటి విద్యలు.. ఇదంతా ఒకప్పటి సామెత. ట్రెండ్ మారింది. యూత్ ఆలోచనలూ మారాయి. తక్కువ సమయంలో పాపులర్ అయినవాళ్లు లేకపోలేదు. వారిని అనుకరించే క్రమంలో ఫీట్స్ చేసి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొందరు యువకులు. తాజాగా ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఓ వీడియో షేర్ చేశారు. ఇంతకీ దాని స్పెషలేంటి? ఇంకాస్త లోతుత్లోకి వెళ్తే..
ఐపీఎస్ అధికారి సజ్జనార్ గురించి చెప్పనక్కర్లేదు. ఆయన ఆలోచనలు ఎప్పుడు యూత్ చుట్టూనే ఉంటున్నాయి. విలువైన జీవితాన్ని కాసింత చదువు కోసం ఉపయోగించే జీవితంలో మంచి ఫలితాలు వస్తాయని పదే పదే చెబుతున్నారు. పరిస్థితులకు సందర్భంగా యువకులు చేస్తున్న అల్లరి చిల్లరి పనుల వీడియోలను బయట పెడుతున్నారు.
యువత తస్మాత్ జాగ్రత్త
ఆన్‌లైన్ గేమింగ్ కు బానిసైన యువత ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది కళ్లకు కట్టినట్టు చూపించారు. దీనిపై యువతలో అవేర్‌నెస్ రప్పించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పని పాటా లేని కొందరు యువకులు చేస్తున్న పిచ్చి పిచ్చి పనుల వీడియో బయటపెట్టారు.
యువతకు రీల్స్ పిచ్చి బాగా పట్టింది. దీని బారినపడి చాలామంది విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొద్దిరోజుల కిందట హైదరాబాద్ శివారు ప్రాంతంలో వచ్చే రైలు ముందు రీల్స్ చేసే క్రమంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఘటన ఇప్పటికీ చాలామంది కళ్లు ముందు కనిపిస్తూ ఉంది. కొడుకు చేసిన ఈ పని వల్ల ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.
ALSO READ: వేణు స్వామి మీ దుకాణం ఇక.. మళ్లీ ట్రోలర్స్ మొదలుపెట్టారు
జరగరానిది జరిగితే దిక్కెవరు?
‘ఫేమస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం! సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టాలా? ఏదో ఘనకార్యం వెలగబెట్టినట్లు ఆ పట్టరాని సంతోషం ఎందుకు.. ఇలాంటివి మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి’ అంటూ రాసుకొచ్చారు. ఈ క్రమంలో ఓ యువకుడు రైలు కింద ఫీట్స్ చేసిన వీడియో జత చేశారు.
సినిమాలో మాదిరిగా రైలు పట్టాలపై పడుకోవడం, దానిపై రైలు వెళ్లడం. ఈ సన్నివేశాన్ని మరొక వ్యక్తి బయట నుంచి షూట్ చేయడం. రైలు సౌండ్‌కు చెవులకు ఏమైనా అయితే దిక్కు ఎవరు? రైలు వెళ్లిన తర్వాత ఆ యువకుడు పట్టాలపై లేచి ఏదో సాధించానని ఆనందంతో పెద్దగా కేకలు పెట్టాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఫేమస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం!
సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టాలా!?
ఏదో ఘనకార్యం వెలగబెట్టినట్లు ఆ పట్టరాని సంతోషం ఎందుకు.. ఇలాంటివి మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి. pic.twitter.com/GF8PDKdqAf
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 11, 2025