Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటకులతో గంగోత్రికి వెళ్తున్న ఓ హెలికాప్టర్ అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసలేం జరిగింది?
అసలేం జరిగింది?
ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశి జిల్లాలో భగీరథి నది సమీపంలో ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఆరుగురు పర్యాటకులతో ఈ హెలికాప్టర్ డెహ్రాడూన్ నుండి బయలు దేరింది. గంగనదికి సమీపంలోకి రాగానే ఏం జరిగిందో తెలీదు. దట్టమైన అడవుల్లో గిర్రున తిరుగుతూ కుప్పకూలింది. ఘటన సమయంలో హెలికాఫ్టర్‌లో పైలట్ సహా ఏడుగురు ఉన్నట్లు సమాచారం. హెలికాఫ్టర్ చెట్ల మధ్య కూలిపోయి నుజ్జునుజ్జు అయ్యింది.
పెద్ద శబ్దం రావడంతో సమీపంలోని ప్రాంతవాసులు ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. ఈలోగా సమాచారం అందుకున్న బలగాలు, రెస్యూ టీమ్‌లు అక్కడికి చేరుకున్నాయి. అప్పటికే ఐదుగురు మృత్యువాత పడ్డారు. తీవ్రగాయాలతో కొన ఊపిరితో వున్న ఓ వ్యక్తిని వైద్య బృందాలు వెంటనే అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
పర్యాటకుల వివరాలు
ఈ ఘటనలో ముంబై నుంచి ముగ్గురు, ఏపీ, గుజరాత్, యూపీ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వారిలో టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ సోదరి దరి వేదవతి కుమారి ఉన్నారు. గాయాలతో బయటపడ్డారు అంబికా లక్ష్మీ నారాయణ బావ భాస్కర్. ఆయన్ని వెంటనే రుషికేష్ ఎయిమ్స్‌కు తరలించారు.
తన సోదరి మరణవార్త విన్న వెంటనే రుషికేశ్ బయలుదేరిన టీడీపీ ఎంపీ లక్ష్మీ నారాయణ. దీంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. అలాగే మృతుల్లో ముంబై నుంచి 61 ఏళ్ల కాలా సోని, 57 ఏళ్ల విజయరెడ్డి, 56 ఏళ్ల రుచి అగర్వాల్ ఉన్నారు. యూపీ నుంచి రాధ అగర్వాల్ మరణించారు. పైలట్ గుజరాత్‌కు చెందిన రాబిన్‌సింగ్. మృతుల్లో ఐదురుగు మహిళలు ఉన్నారు.
నార్మల్‌గా డెహ్రడూన్ నుంచి ఆ ప్రాంతానికి వెళ్లాలంటే దాదాపు 30 కిలోమీటర్లు దూరం ఉంటుంది. హెలికాఫ్టర్ ద్వారా అయితే తొందరగా చేరుకోవచ్చని భావించారు కొందరు పర్యాటకులు. వేగంగా రావాలని భావించి, చివరకు ఈలోకాన్ని విడిచి పెట్టేశారు. అయితే ఆ పర్యాటకులు ఎక్కడివారు అనే వివరాలు ఇంకా తెలియాల్సివుంది.
ALSO READ: కర్రెగుట్టలో భారీ ఎన్ కౌంటర్, 30 మంది మావోలు హతం
ఉత్తర కాశి జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రియాక్ట్ అయ్యారు. హెలికాప్టర్ ఘటన గురించి ఇప్పుడే సమాచారం వచ్చిందన్నారు. గాయపడిన వారికి సాధ్యమైనంత సహాయం అందించాలని అధికారులను కోరారు. జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు.
ప్రారంభమైన చార్‌ధామ్ యాత్ర
ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర జరుగుతోంది. యాత్ర కోసం చాలామంది భక్తులు తరలివస్తున్నారు. మే రెండు నుంచి ప్రారంభమైన యాత్రకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. యమునోత్రి, గంగోత్రి, కేధార్‌నాథ్, భద్రీనాథ్ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు ఉత్తరాఖండ్‌కు వస్తున్నారు. రోడ్డు దారి వెళ్లలేక చాలామంది భక్తులు, హెలికాప్టర్ సేవలు వినియోగించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఘటన జరగడంతో తీవ్ర విషాదం నెలకొంది. యాత్ర మొదలైన ఐదురోజులకే హెలికాప్టర్ కూలడంతో అధికారులు షాకయ్యారు. ఈ ఘటనపై అధికారుల వెర్షన్ మరోలా వుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రమాదం చోటు చేసుకుందని అంటున్నారు. ప్రస్తుతం మృతుల వివరాలను సేకరిస్తున్నారు.