BigTV English
Advertisement

Upendra : ఇంగ్షీషు నేర్చుకోవడానికి అమ్మాయి దొరకలేదట… ఉప్పీ హిలేరియస్ పంచ్

Upendra : ఇంగ్షీషు నేర్చుకోవడానికి అమ్మాయి దొరకలేదట… ఉప్పీ హిలేరియస్ పంచ్

Upendra : కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘యూఐ’ (UI). ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే తాజాగా ‘ది రానా దగ్గుబాటి షో’ (The Rana Daggubati Show) లో పాల్గొన్నారు. అయితే ఈ షోలో భాగంగా ఇంగ్లీష్ గురించి రానాతో మాట్లాడుతూ ఉపేంద్ర వేసిన హిలేరియస్ పంచ్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.


ఉపేంద్ర (Upendra) అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే సినిమాలు A, రా, ఉపేంద్ర. ఇవన్నీ కూడా ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలే. సమాజానికి మెసేజ్ ఇస్తూ ఉపేంద్ర ఈ సినిమాలను తెరకెక్కించిన తీరు ప్రత్యేకంగా ఉంటుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టి, ఉపేంద్ర రూపొందించిన ‘యూఐ’ సినిమా భారీ అంచనాలతో తాజాగా థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో భాష గురించి ఉపేంద్ర చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాజాగా ‘ది రానా దగ్గుబాటి షో’లో పాల్గొన్న ఉపేంద్ర… రానా (Rana Daggubati) కి పంచ్ వేశారు. ఇంటర్వ్యూలో భాగంగా రానా దగ్గుబాటి ‘యూఐ’ హీరో హీరోయిన్లతో ముచ్చటించారు. అందులో భాగంగానే హీరోయిన్ మదర్ టంగ్ ఏంటి? అని అడిగారు రానా. అయితే హీరోయిన్ తన మాతృభాష కూర్గ్ లాంగ్వేజ్ అని చెప్పింది. “ఆ భాష నాకు రాదు. ఇంగ్లీషులో మనం కంఫర్ట్ గా మాట్లాడుకోవచ్చు” అని చెప్పారు రానా. వెంటనే ఉపేంద్ర అందుకొని “నాకు ఇంగ్లీష్ రాదు సార్” అంటూ అమాయకంగా ముఖం పెట్టారు.


“సార్ మీకు భాష అవసరం లేదు” అంటూ రానా నవ్వుతూ పంచ్ వేయగా… “నేను చదివింది గవర్నమెంట్ స్కూల్లో సార్… ఫస్ట్ నుంచి ఏడవ తరగతి వరకు కన్నడ మీడియంలో చదివాను. ఆ తర్వాత తీసుకెళ్లి ఇంగ్లీష్ మీడియంలో పడేశారు” అని ఉపేంద్ర చెప్పుకొచ్చారు. “మరి తెలుగు ఎలా వచ్చింది సార్?” అని చమత్కారంగా ప్రశ్నించారు రానా. దీంతో ఒక్కసారిగా రానా, ఉపేంద్ర (Upendra) లతోపాటు హీరోయిన్ కూడా నవ్వేసింది.

ఆ ప్రశ్నకు ఉపేంద్ర స్పందిస్తూ “తెలుగు మీలాంటి ఫ్రెండ్స్ తో మాట్లాడితే వచ్చింది. కానీ ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ఇలాంటి అమ్మాయి ఎవ్వరూ దొరకలేదు. మాట్లాడి మాట్లాడి నేర్చుకుందాం అంటే” అంటూ హీరోయిన్ ను చూపిస్తూ తనదైన శైలిలో కౌంటర్ వేశారు. ఇక ఈ వీడియోని చూసిన నెటిజెన్లు ఎంతైనా ఉపేంద్ర రూటే సపరేటు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ‘యూఐ’ సినిమా రిలీజ్ కు ముందు పలు ఇంటర్వ్యూలలో ఉపేంద్ర వేసిన కౌంటర్లు, వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈరోజు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ‘యూఐ’ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులను బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×