BigTV English

Actor Venkat: ప్రతివాడు ప్రెస్ అని రివ్యూస్ ఇస్తే ఎలా.. చిరంజీవి రీల్ తమ్ముడు సంచలన వ్యాఖ్యలు

Actor Venkat: ప్రతివాడు ప్రెస్ అని రివ్యూస్ ఇస్తే ఎలా.. చిరంజీవి రీల్ తమ్ముడు సంచలన వ్యాఖ్యలు

Actor Venkat: వెంకట్.. టాలీవుడ్ నటుడు. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇతగాడిని  గుర్తుపట్టడం కష్టమే. అక్కినేని నాగేశ్వరావు ప్రధాన పాత్రలో నటించిన శ్రీ సీతారాముల కళ్యాణం చూతుము రారండి అనే సినిమాలో హీరోగా నటించి కెరీర్ ను మొదలుపెట్టాడు వెంకట్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తరువాత హీరోగా  కాకుండా కీలక పాత్రల్లో నటిస్తూ వచ్చాడు. చిరంజీవి నటించిన అన్నయ్య సినిమాను ఎవరైనా మర్చిపోతారా.. అందులో చిరుకి మూడో తమ్ముడిగా నటించింది వెంకటే. రెండో తమ్ముడిగా మాస్ మహారాజా రవితేజ నటించిన  విషయం  తెల్సిందే.


అప్పట్లో వెంకట్ ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపును అందుకున్నాడు కానీ, అంతగా ఛాన్స్ లను దక్కించుకోలేకపోయాడు. ఇక  శివరామరాజు సినిమాలో జగపతి బాబు తమ్ముడిగా నటించి మెప్పించాడు. మధ్యలో చాలా జిప్ తీసుకున్న వెంకట్ ఈ మధ్యనే మళ్లీ నటుడిగా బిజీగా మారుతున్నాడు. సినిమాలు, వెబ్ సిరీస్ లతో మంచి పేరునే  తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం వెంకట్.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG  సినిమాలో కీలక పాత్ర  చేస్తున్నాడు.

Nora Fatehi: ఆ సాంగ్ కి చిన్న జాకెట్ ఇచ్చారు.. అలా చూపించకండి అని వేడుకున్నాను


తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న  వెంకట్.. యూట్యూబ్ ఛానెల్స్ పై ఫైర్ అయ్యాడు.  సినిమాలు చేసేవారి పర్సనల్స్ తీసి అసభ్యకరమైన థంబ్ నెయిల్స్ పెట్టి పోస్ట్ చేసేవారిపై మండిపడ్డాడు. “ఒక సెలబ్రిటీకి హిట్ పడితే.. అదే రివ్యూ, అదే ఆర్టికల్, అదే సెల్ఫీస్ ఎంతో గొప్పగా ఉంటాయి.  అదే విషయాన్ని గ్రాంటెడ్ గా తీసుకొని మేము ఏదైనా ఒక చిన్న విషయం  అడిగినా.. రాసినా, మాట్లాడినా.. ప్రతి యాక్టర్  ఎందుకు మా పర్సనల్స్  తీసి మీరు ఇలా ఎలా చేయగలుగుతున్నారు అని అడుగుతారు” అని యాంకర్ అడిగిన ప్రశ్నకు వెంకట్ తనదైన రీతిలో సమాధానమిచ్చాడు.

“పర్సనల్స్  లైఫ్ లోకి వెళ్ళకూడదు కదా. మన అదృష్టం.. వృత్తిపరంగా హిందీ ఇండస్ట్రీ వాళ్లతో పోల్చుకుంటే  తెలుగు ప్రేక్షకులు చాలా మంచివారు. ఎవడికి వాడు  ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టేసుకొని నేను ప్రెస్ అంటే మనమేం చేయలేము. కానీ,  నిజాయితీగా ఉండే ప్రెస్ వారు చాలా మంచివారు. కానీ, పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోయి.. అనవసరమైన విషయాలను  తెలుసుకోవడం అనేది అవసరం లేదు. మేము నటులం.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేవాళ్ళం. మా సినిమాలు చూడండి. దానిమీద  కామెంట్స్ చేయండి.

Deepika-Ranveer Singh: బ్రేకింగ్.. దీపికా- రణ్వీర్.. కూతురు పేరు చెప్పేశారోచ్

హీరో నచ్చలేదా.. ? అతని మీద చేయండి. కథ, మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్.. ఇలా ఎవరిమీదనైనా  కామెంట్స్  చేయండి. నిజాయితీగా జర్నలిజం చేసేవాళ్లు అని అంటున్నారు.. నిజంగా జర్నలిజం చేసారేమో చూపించండి. నిజాయితీగా రివ్యూలు ఇచ్చేవారు ఎవరు అంత డెప్త్ గా వెళ్లరు.

ఒక సినిమా స్టార్ట్ అయ్యింది అంటే.. రిలీజ్ అయ్యేవరకు అందులో నటించినవారు.. పనిచేసినవారు చాలా కష్టపడతారు. అందులో మీడియా కూడా ఉంది.  మన ఇండస్ట్రీని మనం ఎదగాలని చూసుకుంటాం కానీ, దాన్ని కిందకు తొక్కేయాలని చూడము కదా. కథ నచ్చకపోతే రాయకండి. షో రన్ అవుతున్నప్పుడే.. హీరో ఎంట్రీ అని, సాంగ్ వచ్చింది అని, కామెడీ సీన్ అని నిమిష నిమిషానికి అప్డేట్ ఎందుకు.వాళ్లు తక్కువ రేటింగ్ ఇచ్చిన సినిమాలు ఆడలేదా.. ఎక్కువ రేటింగ్స్ ఇచ్చిన సినిమాలు పోలేదా.. ? ఆడియెన్స్ కు ఏది కావాలో వారికి తెలుసు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×