BigTV English

Venkatesh: సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్న వెంకీ మామ… కారణం ఇదేనా?

Venkatesh: సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్న వెంకీ మామ… కారణం ఇదేనా?

Venkatesh : టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ (Venkatesh Daggubati) ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. తన కెరీర్‌లో అతిపెద్ద హిట్‌ గా నిలిచిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా ఆయనలో మరింత ఉత్సాహాన్ని పెంచింది. ఈ మూవీ హిట్ ఇచ్చిన బూస్ట్ తో ఆయన వరుస సినిమాలు చేస్తారని అందరూ భావించారు. కానీ వెంకీ మాత్రం సైలెంట్ అయిపోయారు. వెంకీ మామ నెక్స్ట్ మూవీ అప్డేట్ గురించి ఎదురు చూస్తున్న తరుణంలో, దగ్గుబాటి అభిమానులకు బ్యాడ్ న్యూస్ అందింది. ఆయన అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నారు అనే వార్త విన్పిస్తోంది.


సినిమాలకు చిన్న బ్రేక్ 

సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి నిర్మాతలను సైతం ఆశ్చర్యపరిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ భారీ విజయం తర్వాత వెంకీ ఇంకా తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు.


ఇంతలో వెంకీ ఆరోగ్యం గురించి వస్తున్న ఊహాగానాలు ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వెంకీ చాలా కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీంతో డాక్టర్లు ఆయనను కొన్ని నెలల పాటు రెస్ట్  తీసుకోవాలని సూచించారనేది ఆ వార్తల సమాచారం. దీంతో వెంకీ ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు అభిమానులు. ప్రస్తుతం వెంకీ విశ్రాంతి తీసుకుంటున్నాడని, మోకాలి నొప్పి నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన కొత్త సినిమా పనులు మొదలవుతాయని అంటున్నారు. వేసవి సెలవుల తర్వాతే తదుపరి ప్రాజెక్ట్‌ ను ప్రకటిస్తాడని భావిస్తున్నారు.

వెంకటేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కన్ఫ్యూజన్ 

‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో సాలీడ్ కమర్షియల్ హిట్ అందుకున్న వెంకటేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారని టాక్ నడుస్తోంది. అందులో భాగంగానే ఇప్పటిదాకా చాలామంది దర్శకుల పేర్లు వెంకీ మామ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో బయటకు వచ్చాయి.

విక్టరీ వెంకటేష్‌ హీరోగా తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో సినిమా రాబోతోందని గత కొంతకాలంగా టాలీవుడ్ లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. నెక్స్ట్ ఇదే ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కుతుందేమో అనే రూమర్స్ నడిచాయి. కానీ ఇటీవల కాలంలో ‘డీజే టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణతో వెంకీ మామ నెక్స్ట్ మూవీ లాక్ అయిందని జోరుగా ప్రచారం జరిగింది. ఆ తరువాత నందు అనే రచయిత ఈ మధ్యనే వెంకటేష్ కు కథ చెప్పారని, దాని కోసం డైరెక్టర్ వేటలో పడ్డారని వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు కొత్తగా సీనియర్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్‌ పేరు విన్పిస్తోంది. వెంకటేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఇంకా ప్రకటించకపోవడంతో ఇలా రోజుకో కొత్త దర్శకుడి పేరు తెరపైకి వస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×