Big Stories

7th Pay Commission: ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. త్వరలో 4 శాతం డీఏ పెంపు..!

4 Percent DA Hike for Central Govt Employees: ఏడాది ద్వితీయార్థంలో డియర్‌నెస్ అలవెన్స్ పెంపు ప్రకటన కోసం కేంద్ర ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం మరోసారి అధికారం చేపట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుదల కానుకగా వస్తుందని భావిస్తున్నారు. ఈ సమయంలో సిక్కిం ప్రభుత్వం తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.

- Advertisement -

సిక్కిం ప్రభుత్వం తన ఉద్యోగులు, పెన్షనర్లకు పెద్ద బహుమతిని ఇచ్చింది. రాష్ట్ర ఉద్యోగుల కరువు భత్యాన్ని 4 శాతం పెంచే ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిక్కిం కొత్త ప్రభుత్వ ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ తన తొలి క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ఉద్యోగులకు గొప్ప వార్త అందించారు. సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుని కరువు భత్యాన్ని 4 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సిక్కింలో క్రాంతికారి మోర్చా ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ తొలి మంత్రివర్గ సమావేశం సోమవారం జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో డీఏ పెంపు అంశానికి ఆమోదం తెలిపింది.

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం 4 శాతం పెరగడంతో ఈ మొత్తం 46 శాతానికి పెరిగింది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై రూ.174.6 కోట్ల భారం పెరగనుంది. జూలై 1, 2023 నుంచి డియర్‌నెస్ అలవెన్స్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, అంటే, రాష్ట్ర ఉద్యోగులు కూడా జూలై 1, 2023 నుంచి ఇప్పటి వరకు బకాయిలను పొందుతారు.

Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. DA పెంపు.. త్వరలో అమలు

ఈ సంవత్సరం ప్రారంభంలోనే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను 4 శాతం పెంచింది. దీంతో కేంద్ర ఉద్యోగుల డీఏ 50 శాతానికి పెరిగిన విషయం తెలిసిందే. డీఏ పెంపు తర్వాత ఇంటి అద్దె భత్యం, రవాణా భత్యం, పిల్లల విద్యా భత్యం, పర్యటన సమయంలో ప్రయాణ భత్యం, డిప్యూటేషన్ అలవెన్స్, పెన్షన్ కోసం ఫిక్స్‌డ్ మెడికల్ అలవెన్స్, హై క్వాలిఫికేషన్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ ఎన్‌క్యాష్‌మెంట్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, నాన్ ప్రాక్టీస్ అలవెన్స్ వంటివి కూడా పెరిగాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News