Prathap – Anusha Hegde: సినిమా, టీవీ రంగాల్లో ఉన్న వారి జీవితాలు ఎప్పుడు తెరిచిన పుస్తకాలే. వారి లైఫ్‌లో ఏం జరిగిన ప్రేక్షకులకు, అభిమానులకు ఇంట్రస్టింగానే ఉంటుంది. ముఖ్యంగా టీవీ సీరియల్స్‌లో నటించేవారి గురించి తెలుసుకోవాలని మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అలానే టీవీ సీరియల్స్‌లో నటించి, జీవితంలోనూ కలిసి అడుగులు వేస్తున్న జంట అనూషా హెగ్డే.. ప్రతాప్ సింగ్..
వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. ఇటీవలకాలంలో జీ తెలుగులో ప్రససారమైన ‘నిన్నే పెళ్లాడతా’ అనే సీరియల్‌లో నటించారు. ఇక సీరియల్ చేసే టైమ్‌లోనే అనూషా హెగ్డే.. ప్రతాప్ సింగ్ ఇద్దరి మనసులు కలవడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అనూషా సూర్యకాంతం సీరియల్‌లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ సీరియల్ తర్వాత అనూషకు తెలుగులో అవకాశాలు రాలేదు. ప్రతాప్ సింగ్ మాత్రం పలు టీవీ సీరియల్స్‌తో నటిస్తూ.. అందరిని అలరిస్తున్నాడు.
అయితే ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకుని విడిపోబోతోంది అంటూ.. వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే అనూషకు తెలుగులో ఎటువంటి అవకాశాలు రాకపోవడంతో తమిళ్ సీరియల్స్‌లో నటిస్తూ.. హైద్రాబాద్ నుండి తన మకాం చెన్నైకు మార్చింది. ప్రతాప్ సింగ్ మాత్రం తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అవ్వాలి అనే గట్టి ప్రయత్నాలే చేస్తూ.. హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. వీరిద్దరు వివాహం తర్వాత విడివిడిగా ఉంటున్నారంటే.. త్వరలో విడాకులు తీసుకోబోతున్నారంటూ.. ఈ మధ్య వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో.. ప్రతాప్ సింగ్ స్పందిస్తూ.. మేమిద్దరం మా పని నిమిత్తం మాత్రమే విడివిడిగా ఉంటున్నామని, ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేయొద్దు అంటూ స్పష్టం చేశాడు.
ఇకపోతే అనూషా హెగ్డే.. ఈ మధ్యన ప్రతాప్ సింగ్‌కు సంబంధించి.. ప్రతి ఫోటోను తన సోషల్ మీడియా ఎకౌంట్స్ నుంచి డిలీట్ చేసింది. అయితే వీరి పెళ్లికి సంబంధించి ఫోటోలు కాని, ప్రతాప్‌తో ఉన్న జ్ఞాపకాలు అన్నింటిని చెరిపేయడంతో.. అనూషా, ప్రతాప్ సింగ్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు తాజాగా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
అనూషా-ప్రతాప్ జంటకు బుల్లితెరపై చాలా మంది అభిమానులు ఉన్నారనే చెప్పాలి. ఈ జంట కలుసుండాలని కొంతమంది అభిమానులు కోరుకుంటున్నారు. మరికొంత మంది ఈ వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు.
Also Read: అమ్మను గుర్తు చేసుకుని స్టేజ్‌పైనే ఎమోషనల్ అయిన సమంత
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రతాప్ సింగ్ పలు సీరియల్స్‌లో నటిస్తూ.. అందరిని అలరిస్తున్నాడు. తొలిసారి మా టీవీలో ప్రసారమైన శశిరేఖ పరిణయం సీరియల్ నటించి లవర్ బాయ్‌గా మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత కుంకుమ పువ్వు, కుటుంబ గౌరవం, తేనె మనసులు సీరియల్స్‌లో యాక్ట్ చేశాడు. ముద్దపప్పు ఆవకాయ అనే వెబ్ సిరీస్‌లో నిహారికకు జోడీగా నటించాడు. బేవర్స్ అనే మూవీలో కూడా నటించాడు. ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా సీరియల్‌లో నటించాడు.