Samantha: టాలీవుడ్ బ్యూటీ సమంత హీరోయిన్ గానే కాక నిర్మాతగాను సత్తా చాటారు. ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై శుభం చిత్రాన్ని నిర్మించి ప్రొడ్యూసర్ గా, మొదటి అడుగు వేశారు. ఈ చిత్రం మే 9న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. తాజాగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. అందులో భాగంగా సమంత తన తల్లిని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. ఆ వివరాలు చూద్దాం..
అమ్మను గుర్తు చేసుకున్న సమంత ..
సమంత తన ప్రొడక్షన్ హౌస్ ట్రాలాల ద్వారా కొత్త నటీనటులను ఎంకరేజ్ చేయడం కోసమే స్థాపించాను అంటూ, గతంలో ఆమె తెలిపింది. ఆమె నిర్మించిన శుభం సినిమాలో అందరూ కొత్తవారు కావడం విశేషం. ఈ మూవీలో సమంత ఓ అతిథి పాత్రలో నటించారు. తాజాగా సక్సెస్ మీట్ లో సమంత తన తల్లి గురించి మాట్లాడారు. సమంత మాట్లాడుతూ.. నేను ప్రొడక్షన్ వైపుకి ఇంత ధైర్యంగా ఎలా వచ్చేసానో, నాకు ఒక క్షణం ఆలోచిస్తే ఎందుకు అందరూ మళ్లీమళ్లీ సినిమాలు చేస్తున్నారా అని అనుకున్నాను. కానీ సక్సెస్ అయితే ఇంత బాగుంటుందని ఇప్పుడే తెలిసింది. ప్రేక్షకుల ముఖంపై చిరునవ్వులు చూడడమే ఇందుకు కారణం. నేను స్టూడెంట్ గా, ఉన్న టైంలో సమ్మర్ హాలిడేస్ ఇప్పటికీ నాకు గుర్తొస్తున్నాయి. మా కోసం మా అమ్మ ఎంతో కష్టపడిందో ఇప్పుడు తెలిసి వచ్చింది. పిల్లల్ని డిసప్పాయింట్ చేయకుండా సినిమాకి తీసుకెళ్లాలి అని ఆమె ఎప్పుడూ పరితపించేది. మేము ముగ్గురం థియేటర్లో సినిమా చూడటం, పాప్ కార్న్ కోసం మా బ్రదర్ తో గొడవ పడడం, చూసిన సినిమా గురించి ఇంటికి వచ్చి మాట్లాడుకోవడం.. ఇవన్నీ నాకు నిన్నే జరిగినట్లు అనిపిస్తుంది. అలాంటి జ్ఞాపకాలని ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇవ్వడం కోసమే నేను ఈ ప్రొడక్షన్ ని స్థాపించాను. ఆ లక్ష్యంతోనే ప్రొడక్షన్ హౌస్ లో ఇలాంటి మూవీని చేశాను. అని సమంత తెలిపింది.
హీరోయిన్ గా అలా ..ప్రొడ్యూసర్ గా ఇలా ..
ఇంకా సమంత మాట్లాడుతూ ..ఒక హీరోయిన్ గా ఉండడం చాలా హ్యాపీ, అందరికన్నా లాస్ట్ వచ్చి, ఫస్ట్ వెళ్లిపోవచ్చు అది చాలా ఖుషి గా ఉంటుంది. ఒక హీరోయిన్ గురించి చెప్పట్లేదు. నేను కూడా హీరోయిన్ గా అలానే ఉండేదాన్ని, నా క్యారెక్టర్ నేను చూసుకోవడం, సెల్ఫిష్ గా నా పార్ట్ నేను చేసుకోవడం వెళ్ళిపోవడం నటిగా ఉంటుంది. కానీ ప్రొడ్యూసర్ అంటే చాలా కష్టం. పోస్ట్ ప్రొడక్షన్ కోసం చాలా కష్టపడి, టీమ్ అందర్నీ ముందుకు తీసుకురావడం, స్టూడియోలోనే పోస్ట్ ప్రొడక్షన్ వాళ్ళు ఎన్నో రోజులు ఉండి కష్టపడి పని చేశారు. నాకు దొరికిన ఈ టీం అంతా ఈ మూవీ సక్సెస్ లో భాగమయ్యారు. ఇలాంటి టీం నాకు దొరకడం నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. సినిమా స్టార్టింగ్ లో ఉన్నాను. తర్వాత లాస్ట్ లో ప్రొడక్షన్స్ కి నేను బయటికి వచ్చాను. నేను మూవీ కోసం కష్టపడింది చాలా తక్కువ. డైరెక్టర్, కోస్టార్స్, ప్రొడక్షన్ టీం అందరూ చాలా బాగా కష్టపడ్డారు. అందుకే ఈ సినిమా ఇంతకీ హిట్ అయింది అని ఆమె తెలిపింది.
శుభం సక్సెస్..
శుభం మూవీ మే 9న ధియేటర్లలో రిలీజ్ అయి మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రిలీజ్ అయిన వారంలోపే 5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా హర్రర్ కామెడీ జోనర్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్లీన్ ఎంటర్టైన్మెంట్ తో, ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేసే మూవీ. ఒకప్పుడు వచ్చిన క్షేమంగా వెళ్లి లాభంగా రండి, సందడే సందడి లాంటి క్లాసిక్ కామెడీ చిత్రాలతో ఈ మూవీని ఎంతోమంది పోల్చడం జరిగింది. నిర్మాతగా సమంతకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది. ఈ సినిమా విడుదలకు ముందే ఓటీటీ, సాటిలైట్ రైట్స్ లో భారీ డిమాండ్ తో కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ఇక సమంత తన మొదటి సినిమాతో సక్సెస్ ని అందుకుంది ఇక ఆమె ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ పై మరెన్నో చిన్న సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నట్లు సమంత తెలిపింది.