Tollywood: ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఒక హోదాకు వచ్చిన తర్వాత వారు మళ్ళీ తమ వారసులను అదే ఫీల్డ్ లోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఇండస్ట్రీలో అత్యంత సహజంగా కనిపించే అంశం. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు తమ తదనంతరం, తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసి, తమ పరంపరను కొనసాగిస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం తమ పిల్లలను ఇండస్ట్రీకి దూరంగా ఉంచి, వారికంటూ ఒక గుర్తింపును అందించే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఇండస్ట్రీలోకి రావడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ. ఇండస్ట్రీకి దూరంగా వేరే రంగంలో సెటిల్ అయినా వారు కూడా లేకపోలేదు. ఇకపోతే తాజాగా ఇప్పుడు పైన కనిపిస్తున్న ఫోటోలోని అమ్మాయి సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఆమెను చూస్తే హీరోయిన్స్ కూడా కుళ్ళుకోవాల్సిందే అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంత అందంగా ఉండే ఆ అమ్మాయి ఎవరు? ఎవరి కూతురు? ఎందుకు ఇండస్ట్రీలోకి రాలేదు? అనే విషయాలపై కూడా ఆరా తీస్తున్నారు. మరి అసలు ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా?
పైన చీర కట్టులో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో కాదు ఒక స్టార్ డైరెక్టర్ కూతురు. అందంలో హీరోయిన్లను కూడా మించిపోయింది. హీరోయిన్ లా కనిపిస్తున్న ఈ అమ్మాయి దక్షిణాదిలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఒక దర్శకుడు గారాల పట్టి..ఇంతకీ ఆయన ఎవరో కాదు తెలుగు, తమిళ్ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ (K.S.Ravikumar) కూతురే ఈ అమ్మాయి. ఈ అమ్మాయి పేరు జస్వంతి రవికుమార్ (Jaswanti Ravi Kumar ). డైరెక్టర్ కూతురు అయ్యుండి కూడా ఇండస్ట్రీకి దూరంగా ఉండడంతో అందరూ ఎందుకు దూరంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈమె సినీ రంగానికి దూరంగా ఉంటోంది. అయితే సడన్ గా ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఈమె ఎవరు అని ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే డైరెక్టర్ శంకర్ (Director Shankar)కూతురు అదితి శంకర్ (Aditi Shankar) తో పాటు హీరో అర్జున్ (Arjun) కూతురు ఐశ్వర్య (Aishwarya ) కూడా తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ డైరెక్టర్ రవికుమార్ కూతురు జస్వంతి మాత్రం ఇంత అందంగా ఉన్నా సరే ఇండస్ట్రీకి దూరంగా ఉండడంతో అభిమానులు పలు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం..
కే.ఎస్.రవికుమార్ కెరియర్..
కే.ఎస్. రవికుమార్ విషయానికి వస్తే.. కమలహాసన్ (Kamal Haasan) తో ‘దశావతారం’, రజనీకాంత్ (Rajinikanth) తో ముత్తు, నరసింహ వంటి చిత్రాలు చేసిన ఈయన.. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా స్టార్ హీరోలతో అనేక చిత్రాలు రూపొందించారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన స్నేహం కోసం, బావ నచ్చాడు , జై సింహా , రూలర్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన.. దర్శకుడు మాత్రమే కాదు నటుడు, రచయిత, నిర్మాత కూడా.. అగ్ర హీరోలతో కలసి ఎన్నో చిత్రాలు చేసిన ఈయన.. ఇప్పుడు అడపాదడపా మాత్రమే చిత్రాలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. మరి మునుముందు అయినా తన కూతుర్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తారో లేదో చూడాలి.
ASLO READ:Kannappa Comic Book 3: కన్నప్ప మూవీ నుండి మరో వీడియో.. ఈసారి తెలుగు మాత్రం కాదు..!