E-Paper
Advertisement

Navjot Singh Sidhu: 33 కేజీలు తగ్గిన టీమిండియా ప్లేయర్.. ఆ వ్యాధి సోకిందా ?

Navjot Singh Sidhu: 33 కేజీలు తగ్గిన టీమిండియా ప్లేయర్.. ఆ వ్యాధి సోకిందా ?
Advertisement

Navjot Singh Sidhu: మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దు 33 కిలోల బరువు తగ్గారు. కేవలం 5 నెలల్లోనే సిద్దు ఈ బరువు తగ్గినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదిక స్వయంగా వెల్లడించారు. బరువు తగ్గిన ఆయన ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అధిక బరువు ఉన్నప్పటి ఫోటో, ఇప్పుడు బరువు తగ్గిన ఫోటోలను {Navjot Singh Sidhu} పోస్ట్ చేశారు.

Also Read: Shadab Khan: హీరోయిన్లకు అసభ్యకరమైన మెసేజ్‌ లు.. పాకిస్థాన్‌ ప్లేయర్‌ అరాచకం !

Advertisement

ఆగస్టు నుండి కేవలం ఐదు నెలల్లోనే 33 కిలోల బరువు తగ్గినట్లు పేర్కొన్నారు. దృఢమైన సంకల్పం, ప్రణాయామం, మంచి ఆహారం, సుదీర్ఘ నడకతోనే ఇది సాధ్యమైందని సిద్దు {Navjot Singh Sidhu} పేర్కొన్నారు. జీవితంలో అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదని అన్నారు సిద్దు. ఆరోగ్యకరమైన శరీరాన్ని కలిగి ఉండడమే గొప్ప వరం అన్నారు. అయితే గతంలో ఓ కేసు విషయంలో జైలుకు వెళ్లిన సిద్దు.. ఆ సమయంలో కూడా జైలులో ఆరు నెలల్లోనే 34 కేజీలు బరువు తగ్గారు.

ఆ సమయంలో 6.2 అడుగుల ఎత్తు ఉన్న సిద్దు.. 99 కిలోల బరువు ఉండేవారు. సంపూర్ణ ఆరోగ్యంతో క్రికెటర్ గా ఉన్నప్పుడు సిద్దు {Navjot Singh Sidhu} ఎలా కనిపించారో.. ఇప్పుడు కూడా సిద్దు అలాగే కనిపిస్తున్నారు. గతంలో సిద్దు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు. దాని నుంచి బయటపడేందుకు ప్రత్యేక ఆహార అలవాట్లను వైద్యులు సూచించడంతో ఆయన పాటించి బరువు తగ్గారు. ఇప్పుడు మరోసారి అవే నియమాలను పాటించి 33 కిలోల బరువు తగ్గారు.

Advertisement

ఇందుకు సంబంధించిన ఫోటోలను {Navjot Singh Sidhu} ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్ద ఎత్తున లైక్స్ వచ్చి పడుతున్నాయి. ఈ రెండు ఫోటోలను చూసి ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇక క్రికెట్ కి దూరమయ్యాక సిద్దు రాజకీయాలలో బిజీగా మారారు. నవజ్యోత్ సింగ్ సిద్దు 1983 నుండి 1998 వరకు టీమిండియా తరపున 187 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడారు. తన 15 ఏళ్ల కెరీర్ లో 51 టెస్టులు, 136 వన్డేలు ఆడారు. ఇందులో 15 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Also Read: Weirdest Run-out: క్రికెట్‌ చరిత్రలో తొలిసారి.. వింత ర‌నౌట్‌.. ఏకంగా హెల్మెట్‌తోనే !

టెస్టుల్లో మొత్తంగా 3,202 పరుగులు చేసిన సిద్దు.. వన్డేల్లో 4,413 పరుగులు చేశాడు. ఇక 2001లో భారత్ – శ్రీలంక పర్యటనలో సిద్దు {Navjot Singh Sidhu} కామెంటరీ కూడా చేశారు. తన విలక్షణమైన మాటలతో అందరినీ అలరించారు. ఆయన చమత్కారమైన మాటలకు ప్రసిద్ధి. 61 ఏళ్ల సిద్దు భారత క్రికెట్ లో ఐకానిక్ వాయిస్ లలో ఒకరు. అంతర్జాతీయ మ్యాచ్లలో తన గాత్రాన్ని అందించడమే కాకుండా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అనేకసార్లు ప్రసారకర్తలకు కూడా పనిచేశారు.

 

 

View this post on Instagram

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×