Prabhas: టాలీవుడ్ లో సీనియర్ లేదు.. జూనియర్ లేదు. పెళ్లి కానీ హీరోలందరూ పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. అందరి ఫ్యాన్స్ చక్కగా తమ హీరోల పెళ్లిళ్లు, వారి పిల్లలను చూసి.. ఆ వారసులు ఎప్పుడు వస్తారో అని ఎదురుచూస్తున్నారు. కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం అసలు డార్లింగ్ పెళ్లి చేసుకుంటాడా .. ? అనే అనుమానంలోనే జీవితాన్ని గడిపేస్తున్నారు. ఈశ్వర్ సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన ప్రభాస్ .. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ ఒక్క సినిమాతో వెనక్కి తిరిగి చూసుకోలేనంత ఎత్తుకు ఎదిగాడు.
సాధారణంగా కెరీర్ సెట్ అయ్యాక అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు. కానీ, డార్లింగ్ మాత్రం ఎంత ఎత్తుకు వెళ్లినా ఇప్పటివరకు పెళ్లి ఊసు ఎత్తిందే లేదు. ఇక ఇండస్ట్రీలో ప్రభాస్ కు కొన్ని రిలేషన్స్ ఉన్నాయని పుకార్లు వచ్చాయి. హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడని వార్తలు వచ్చాయి. అందులో కూడా ఎలాంటి నిజం లేదు. ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి.. ప్రభాస్ కు మంచి అమ్మాయిని చూస్తాం. కచ్చితంగా ఆ అమ్మాయి ఇండస్ట్రీ నుంచి అయితే ఉండదు అని చెప్పుకురావడంతో.. ఇక హీరోయిన్స్ ను వదిలేసి.. కృష్ణంరాజు బంధువుల అమ్మాయిల మీద పడ్డారు.
ఎప్పటినుంచో శ్యామల దేవి.. తమ బంధువుల అమ్మాయిని ప్రభాస్ కోసం చూస్తుందని, రెండు కుటుంబాల మధ్య మాటలు కూడా జరిగాయని చెప్పుకొచ్చారు. దీంతో మా ప్రభాస్ అన్న.. పెళ్లి కొడుకు ఆయనే అంటూ డ్యాన్స్ లు వేశారు. కానీ అందులో కూడా నిజం లేదని తెలియడంతో నిరాశకు చెందారు. ఇక ఈ మధ్య నందమూరి బాలకృష్ణ తన అన్ స్టాపబుల్ షోలో చరణ్ చేత.. ప్రభాస్ పెళ్ళికి సంబంధించిన న్యూస్ ను లీక్ చేయించడాని వార్తలు బయటకొచ్చాయి.
సంక్రాంతి విశిష్టతను తెలిపే తెలుగు సాంగ్స్ అంటే ఇవే..
గణపవరంకు చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నట్లు రామ్ చరణ్ చెప్పాడని అన్నారు. దీంతో మళ్లీ డార్లింగ్ ఫ్యాన్స్ గుండెల్లో వీణలు మోగాయి. అయ్యబాబోయ్ ఇదే నిజమైతే.. ఎంత బావుండు అని అనుకున్నారు. కానీ, ఇది కూడా నిజం కాదని తేలిపోయింది. ఇప్పటికే చరణ్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా చేసి మొదటి భాగాన్ని రిలీజ్ చేశారు. సంక్రాంతి కానుకగా రెండో భాగాన్ని జనవరి 17 న రిలీజ్ చేయనున్నారు.
ఇక పార్ట్ 2 ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో డార్లింగ్ ప్రభాస్, చరణ్, బాలయ్య ఫోన్ కాల్ సంభాషణ హైలైట్ గా నిలిచింది. బాలయ్య .. ప్రభాస్ తో మాట్లాడుతూ.. ” గణపవరానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావని చరణ్ చెప్పాడు ” అని అడగ్గా.. ప్రభాస్ టక్కున ” గణపవరమా.. ఎక్కడ అది.. ఇక్కడ యూరప్ లోనా.. ? ” అని అనేశాడు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు.
అదేంటండీ ప్రభాస్ అంత మాట అన్నాడు.. అంటే ఇదంతా నిజం కాదా.. ? చరణ్ ఊరికే చెప్పాడా.. ? అని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయ్యో చరణ్.. ఎంత మోసం చేసావ్.. నువ్వు చెప్పవని నిజంగానే పెళ్లి చేసుకుంటున్నాడు మా అన్న అనుకున్నాం.. కానీ, అసలు గణపవరం ఎక్కడ అని అడుగుతున్నాడు అంటే ఆ విషయం ఆయనకు కూడా తెలిసి ఉండదు కదా అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ ఏడాది అయినా ప్రభాస్ పెళ్లి ఉంటుందో.. లేదో చూడాలి.