BigTV English

Bhagyashri Borse: భాగ్యశ్రీ బొర్సే సాహసం.. విమానం నుంచి అమాంతంగా దూకేసి..

Bhagyashri Borse: భాగ్యశ్రీ బొర్సే సాహసం.. విమానం నుంచి అమాంతంగా దూకేసి..

Bhagyashri Borse: ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే భాగ్యశ్రీ బోర్సే అని చెప్పొచ్చు. మిస్టర్ బచ్చన్ విడుదల తో ఈమె తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. కానీ భాగ్యశ్రీ కి మాత్రం మంచి ఆఫర్లు తెచ్చి పెట్టింది. ఆమె హైట్ దానికి, తగ్గ రూపం హార్ట్ లుక్స్, భాగ్యశ్రీ కి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. తాజాగా ఈమె విజయ్ దేవరకొండ సరసన గౌతం తిన్నసూరి దర్శకత్వంలో వస్తున్న’కింగ్డమ్’ మూవీలో నటిస్తున్నారు.ఈ మూవీ మే 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోషల్ మీడియాలో భాగ్యశ్రీ చురుగ్గా ఉంటారు. ఆమె వ్యక్తిగత విషయాలు, తన ప్రయాణ అనుభవాలు, ఫోటోలు అభిమానులతో పంచుకుంటుంది. అందులో భాగంగా తాజాగా ఈమె సోషల్ మీడియా లో తన అద్భుతమైన సాహస విన్యాస వీడియోను పోస్ట్ చేశారు. ఆ వివరాలు చూద్దాం..


భాగ్యశ్రీ బొర్సే సాహసం…

భాగ్యశ్రీ బోర్సే మొదట మోడల్ గా తన కెరీర్ ని అడుగుపెట్టి బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించారు. గత సంవత్సరం మిస్టర్ బచ్చన్ చిత్రంతో తెలుగు లో పాపులర్ అయ్యారు. ఈ మూవీ తరువాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ లో ఒకటే లైఫ్, ఒకటే శ్వాస, ఒకటే జంప్ అంటూ క్యాప్షన్ ని పెట్టి తన స్కై డ్రైవ్ వీడియోను పోస్ట్ చేశారు. ఆమె విమానం లోకి వెళ్లి అక్కడి నుంచి స్కై డ్రైవ్ చేశారు. ఒకసారిగా ఎయిర్ బెలూన్స్ తో పైకి ఎగిరి ఆకాశంలో కొంతసేపు విహరించి భూమిపైకి వచ్చారు. ఈ వీడియోలో ఆమె ఎంతో ఉత్సాహంగా ఈ డ్రైవ్ కంప్లీట్ చేసినట్టు పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన వారంతా మన హీరోయిన్ సాహసం కి ఒక లైక్ ఇస్తూ షేర్ చేస్తున్నారు.


ఆ హీరో తో రూమర్స్..

తొలి సినిమాతోనే అందరికీ అభిమాన నటిగా మారిపోయిన ఈ హీరోయిన్ పై సోషల్ మీడియాలో ఓ రూమర్ వినిపిస్తోంది. యంగ్ హీరో రామ్ పోతినేని తోఈమె డేటింగ్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆమె రామ్ తో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే, ఈ మూవీలో ఆమెపేరు ప్రకటించినప్పటి నుండి ఈ రూమర్స్ ఎక్కువయ్యాయి. ఇటీవల వీళ్లిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసిన వారి ఫోటోలు, ఒకటే బ్యాక్ గ్రౌండ్ ఉందంటూ వారి డేటింగ్ రూమర్స్ ని మరింత వైరల్ చేశాయి.

వరుస సినిమాలు ..

ఇక భాగ్యశ్రీ 2024లో కార్తీక్ ఆర్యన్ సరసన, చందు ఛాంపియన్ సినిమాలో నటించి మెప్పించారు.ఈ చిత్రం లో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీలో,నటిస్తూ మరో మూవీలో ఛాన్స్ కొట్టేశారు. రామ్ హీరోగా డైరెక్టర్ మహేష్ బాబు తో, తన 22వ సినిమా ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీ నటిస్తున్నారు. ఈ చిత్రం మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె మహాలక్ష్మి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. వీటితోపాటు నాని హీరోగా సుజిత్ దర్శకత్వంలో రాబోయే నాని నెక్స్ట్ సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×