Balakrishna Injured:స్వర్గీయ నందమూరి తారక రామారావు (Sr .NTR) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి తెలుగు సినీ పరిశ్రమకు మూల స్తంభంగా నిలిచిన ఈయన .. సాంఘిక, పౌరాణిక, చారిత్రక సినిమాలతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా బాధ్యతలు నిర్వర్తిస్తూ.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు సొంతం చేసుకున్న సీనియర్ ఎన్టీఆర్.. తన అద్భుతమైన నటనతో, అంతకుమించి ఆహార్యంతో చూపరులను ఆకట్టుకునేవారు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎన్టీఆర్ సినిమా వస్తోందంటే చాలు అప్పట్లో ఎడ్ల బండ్లు కట్టుకొని మరీ థియేటర్ కి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదండోయ్ కృష్ణ (Krishna) వంటి స్టార్లతో పోటీపడుతూ ఏకకాలంలో పదుల సంఖ్యలో సినిమాలు విడుదల చేసి సత్తా చాటిన ఘనత స్వర్గీయ నందమూరి తారకరామారావుది. అంతేకాదు తన పాత్రలతో నిజ దేవుడిగా ప్రజలలో చిరస్థాయిగా పునాదులు వేశారు. ఇప్పటికీ రాముడు, శ్రీకృష్ణుడు అనగానే సీనియర్ ఎన్టీఆర్ గుర్తుకొస్తారు అంటే ఆ పాత్రలతో ప్రజల హృదయాలలో ఏ విధంగా స్థానం సంపాదించుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
సినిమా విడుదలకు సెన్సార్ ఆలస్యం.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..?
క్రమశిక్షణకు మారుపేరుగా, నిర్మాతల మనిషిగా పేరు సొంతం చేసుకున్న సీనియర్ ఎన్టీఆర్ తన సినిమాల ద్వారానే తన వారసులు హరికృష్ణ (Harikrishna), బాలకృష్ణ (Balakrishna) లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇకపోతే ఒకానొక సమయంలో.. శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్ర సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారు..? సెన్సార్ రావడానికి ఎన్ని అవస్థలు పడ్డారు..? సెన్సార్ సినిమాలో కొన్ని సన్నివేశాలు కట్ చేయమన్నప్పుడు ఆయన మొండి పట్టుదల ఎలా బయటపడింది..? ఆ సినిమా చివర్లో తన కన్న కొడుకు బాలకృష్ణ తల పగిలితే.. ఎన్టీఆర్ రియాక్షన్ ఏంటి? అనే విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్ (Prasanna Kumar) తెలియజేశారు.
బాలయ్య తలకు గాయం.. ఎన్టీఆర్ రియాక్షన్..
ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. “సీనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి సినిమా అనుకున్నప్పుడు..” బాలకృష్ణతో నువ్వు కష్టపడితేనే ఈ సినిమా హిట్ అవుతుంది. లేకపోతే డిజాస్టర్ అవుతుంది” అని ఎన్టీఆర్ చెప్పారు. అప్పుడు బాలకృష్ణ.. నాన్నగారు పెద్ద హీరో.. ఆయనే సినిమాకి ఆయువు పట్టు.. నేనేదో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని.. నా మూలంగా సినిమా సూపర్ హిట్ అంటారేంటి ఈయన అనే డైలామాలో పడ్డారట. ఇక వీరబ్రహ్మేంద్ర స్వామి పాత్రలో ఎన్టీఆర్ నటించగా.. పక్కనే ఆయన శిష్యుడు సిద్దయ్య పాత్రలో బాలకృష్ణ నటించారు. కాంచన ఇందులో లీడ్రోల్ పోషించారు. అలాగే రతి కూడా నటించారు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని కూడా చాలా కష్టపడి తెరకెక్కించారు. ఇంత అద్భుతంగా తీస్తే సెన్సార్ వాళ్లేమో సినిమాను కట్ చేయమని సూచించారు. ప్రాబ్లం క్రియేట్ చేసి చాలాకాలం సినిమా విడుదల అవ్వకుండా ఆపారు. ఆఖరికి అందులో కొన్ని కట్స్ చెప్పడంతో.. రీల్ మొత్తం తగలబెట్టేస్తాను కానీ అందులో ఒక్క సీన్ కూడా కట్ చేయనని నిర్మొహమాటంగా చెప్పారు ఎన్టీఆర్. ఇక అందులో ముఖ్యంగా సినిమా చివర్లో బ్రహ్మంగారు జీవ సమాధి అయ్యే సన్నివేశం.. సిద్దయ్య వచ్చే సమయానికి ఆయన జీవ సమాధి అయిపోతారు. అప్పుడు సిద్దయ్య అక్కడికి వచ్చి ఈయన వెళ్లిపోయారు.. నేనేం తప్పు చేశాను అని చెప్పి, ఆ సమాధి వద్ద.. ఆ సమాధికేసి తల కొట్టుకుంటాడు సిద్ధయ్య (బాలకృష్ణ). ఆ సమాధి కేసి కొట్టుకుంటున్న సమయంలో నిజంగానే బాలయ్య తల పగిలింది. పైగా రక్తం కారుతోంది. సాధారణంగా ఎవరైనా సరే కన్న కొడుకు, పెద్ద స్టార్ హీరో కొడుకు తల పగిలింది అంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. కానీ ఎన్టీఆర్ మాత్రం సినిమా కోసం పోయినా పర్లేదు అనుకునే రకం.. బాలకృష్ణకు తల పగిలినా సరే ఆయన అందులో పాత్రను చూశారే కానీ తన కొడుకుకు తగిలిన గాయాన్ని చూడలేదు. అంత గొప్ప నటుడు సీనియర్ ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ గొప్పతనాన్ని వివరించారు ప్రొడ్యూసర్ ప్రసన్నకుమార్. అంతేకాదు తన తండ్రి చెప్పిన మాటలు మేరకు సినిమా సక్సెస్ అవ్వడానికి పాత్రలో లీనం అయిపోయి మరీ తల పగిలినా.. ఆ పాత్ర నుంచి బయటకు రాని బాలకృష్ణ నటనను కూడా మెచ్చుకున్నారు.అలా బాలకృష్ణ నాటినుండి నేటి వరకు సినిమా కోసమే బ్రతుకుతున్నారు కాబట్టి ఇండస్ట్రీలో ఇటీవల 50 వసంతాలు పూర్తిచేసుకుని ప్రపంచ సినీ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.
ASLO READ:Chandrabose: ఆటోగ్రాఫ్ అడిగితే సిరివెన్నెల ఏం చేశారంటే.. చంద్రబోస్ ఎమోషనల్ కామెంట్స్..!