BigTV English

Diabetes: స్వీట్స్ తింటే డయాబెటిస్ వస్తుందా? డాక్టర్స్ చెప్పేది వింటే షాక్ అవుతారు

Diabetes:  స్వీట్స్ తింటే డయాబెటిస్ వస్తుందా? డాక్టర్స్ చెప్పేది వింటే షాక్ అవుతారు

Diabetes: ఎక్కువ స్వీట్స్ తినడం వల్ల డయాబెటిస్ వస్తుందా అనే సందేహం చాలా మంది మదిలో మెదులుతూ ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా డయాబెటిస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం ముఖ్యం. డయాబెటిస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం లేదా ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటిస్ కు కారణమవుతుంది. డయాబెటిస్ రెండు రకాలు టైప్-1, టైప్-2. టైప్- డయాబెటిస్ జన్యుపరంగా లేదా ఆటోఇమ్యూన్ కారణాల వల్ల, టైప్-2 డయాబెటిస్ ఎక్కువగా లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల వల్ల వస్తాయని వైద్యులు చెబుతున్నారు.


స్వీట్స్ వల్ల షుగర్?
స్వీట్స్ లేదా చక్కెర ఎక్కువగా తినడం డయాబెటిస్‌కు ప్రత్యక్ష కారణం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కేలరీలు పేరుకుపోయి ఊబకాయం లేదా అధిక బరువు సమస్యలు వచ్చి టైప్-2 డయాబెటిస్‌కు కారణం కావచ్చు. స్వీట్స్‌లో ఉండే రిఫైన్డ్ షుగర్, సాధారణ కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచడమే కాదు, ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు దారితీసి టైప్-2 డయాబెటిస్‌కు పునాది వేస్తుంది.

అంతే కాకుండా, స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం తగ్గిపోతుంది. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాలు తక్కువగా తీసుకోవడం వల్ల శరీర జీవక్రియ బలహీనపడి డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. చక్కెర ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం డయాబెటిస్‌తో పరోక్షంగా ముడిపడి ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.


డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడానికి ఆహారం, రెగ్యులర్ వ్యాయామం, ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. స్వీట్స్‌ను పూర్తిగాకాకపోయినా వాటిని మితంగా తీసుకోవడం, ఫ్రూట్స్, గింజలు, ఇతర సహజమైన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడి డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని చాలా శాతం వరకు తగ్గిస్తుంది. డయాబెటిస్ ప్రమాదం గురించి ఆందోళన ఉన్నవారు వైద్యుల సలహా మేరకు తమ ఆహార అలవాట్లను మార్చుకోవడం మంచిది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×