E-Paper
Advertisement

Kayadu Lohar : గోల్డెన్ ఛాన్స్ పట్టేసిన కయాదు… ఆ హీరోతో సినిమా అంటే ప్యారడైజ్ లో కాలు పెట్టినట్టే

Kayadu Lohar : గోల్డెన్ ఛాన్స్ పట్టేసిన కయాదు… ఆ హీరోతో సినిమా అంటే ప్యారడైజ్ లో కాలు పెట్టినట్టే
Advertisement

Kayadu Lohar : లేటెస్ట్ సోషల్ మీడియా సెన్సేషన్ కయాదు లోహర్ టాలీవుడ్లో అడుగు పెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ బ్యూటీ ఓ క్రేజీ హీరో సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ పట్టేసింది అనేది టాలీవుడ్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న రూమర్. ఒకవేళ ఆ వార్తలు గనక నిజమైతే ఈ అమ్మడు ‘ప్యారడైజ్’లో కాలు పెట్టినట్టే అంటున్నారు అభిమానులు. ఇంతకీ కయాదు లోహర్ టాలీవుడ్ లో ఏ హీరో సరసన నటించే ఛాన్స్ పట్టేసింది? అనే వివరాల్లోకి వెళితే…

ఇష్టమైన హీరోతో టాలీవుడ్ ఛాన్స్ 

Advertisement

ఇటీవల రిలీజ్ అయిన ‘డ్రాగన్’ (Dragon) మూవీతో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది హీరోయిన్ కయాదు. ఈ మూవీ వచ్చి నెలలు గడుస్తున్నా సరే ఎక్కడ చూసినా ఇంకా ఆమె ఫోటోలు వీడియోలే కనిపిస్తున్నాయి. ‘డ్రాగన్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం కూడా ఈ అమ్మకి బాగా కలిసి వచ్చింది. ఈ సినిమాలో పల్లవిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కయాదు 2021లో ఓ కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

ఆ తర్వాత మలయాళ, మరాఠీ భాషల్లోనూ నటించింది. కాలేజ్ టైంలో అందాల పోటీల్లో పాల్గొని పూణే ఫ్రెష్ టైమ్ కిరీటాన్ని అందుకున్న ఈ భామ తెలుగులో కూడా నటించింది. శ్రీవిష్ణు సరసన ‘అల్లూరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ అమ్మడు. కానీ ఆ సినిమా ఆడకపోవడంతో కయాదు తెలుగులో అడ్రస్ లేకుండా పోయింది. ఇక ఇటీవల ‘డ్రాగన్’ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఈ అమ్మడికి ఎట్టకేలకు మరోసారి టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈసారి ఏకంగా నానితో సినిమా చేసే ఛాన్స్ కయాదును వరించింది అంటున్నారు. నిజానికి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తనను నాని (Nani), అల్లు అర్జున్ అంటే ఇష్టమని చెప్పింది ఈ బ్యూటీ.

Advertisement

Read Also : పెళ్ళాం ఆత్మ అని తెలీక సంసారం చేసే భర్త… కామెడీతో కేక పెట్టిస్తున్న మూవీ

నాని ‘ప్యారడైజ్’లోకి ఎంట్రీ? 

రీసెంట్ గా ‘హిట్ 3’ (Hit 3) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హీరో నాని. ఈ మూవీ ప్రొఫెషన్స్ లో ఎంతో యాక్టివ్ గా పాల్గొన్న నాని ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’ (The Paradise)పై ఫోకస్ పెట్టాడు. ‘దసరా’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో నాని ఈ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాని ఇదొక మ్యాడ్ మ్యాక్స్ ఫిలిమ్ అని చెప్పి సినిమాపై అంచనాలు పెంచారు. ప్రస్తుతం అమెరికా టూర్ లో ఉన్న నాని తిరిగి రాగానే, ఈ మూవీ షూటింగ్ ను షురూ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అందులో ఒకరిగా కయాదుని మేకర్స్ కన్ఫర్మ్ చేశారని టాక్ నడుస్తోంది. మరో హీరోయిన్ ఎవరు? అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×