Shobhita dhulipala: గత కొన్ని రోజులుగా అక్కినేని కొత్త కోడలు శోభిత ధూళిపాల (Shobhita dhulipala) త్వరలో శుభవార్త చెప్పబోతుందని వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు నిన్నటికి నిన్న మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi), ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్v(Varun Tej) తల్లిదండ్రులు కాబోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక వీరిలాగే అక్కినేని కొత్త కోడలు కూడా శుభవార్త చెప్పబోతోంది అంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది శోభిత.
శోభిత ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన టీమ్..
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. దాదాపు రెండు సంవత్సరాల పాటు ప్రేమించుకుని గత ఏడాది డిసెంబర్లో పెళ్లి పేరిట ఒకటయ్యారు నాగచైతన్య (Naga Chaitanya), శోభిత. ఇక ఇప్పుడు గర్భంతో వున్నట్లు విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే ఇటీవల ముంబైలో జరిగిన WAVES -2025 సమ్మిట్ లో శోభిత ధూళిపాల వదులుగా ఉండే చీరకట్టులో కనిపించడంతో ఈ ప్రెగ్నెన్సీ రూమర్లు మరింత ఎక్కువయ్యాయి. ఇలా వార్తలు రోజుకొకటి చొప్పున వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా శోభిత టీం శోభిత తరఫున స్పందించింది. “గుడ్ న్యూస్ అంటూ వస్తున్న వార్తలు వట్టి పుకార్లు మాత్రమే. శోభిత పర్సనల్ లైఫ్ గురించి వినిపిస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదు. ప్రస్తుతం ఆమె వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. మాతృత్వం పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు” అంటూ ఆమె టీం స్పష్టం చేసింది. మొత్తానికి అయితే ప్రెగ్నెన్సీ అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఆమె టీం కొట్టి పారేసింది. మరి ఇకనైనా ఈ వార్తలకు చెక్ పడుతుందో లేదో చూడాలి.
ఆగని రూమర్స్ పై శోభిత రియాక్షన్..
ఇదిలా ఉండగా.. మరొకవైపు వేవ్స్ 2025 సమ్మిట్ లో శోభిత ధరించిన చీరపై వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో స్వయంగా శోభిత దీనిపై స్పందించింది.” అది మెటర్నిటీ డ్రెస్ కాదు. యాంటీ- ఫిట్ డ్రెస్. కేవలం వస్త్రధారణ వల్లే ఇలాంటి రూమర్లు రావడం అనేది ఆశ్చర్యంగా ఉంది” అంటూ కామెంట్ చేసింది శోభిత. మొత్తానికి అయితే తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలను కొట్టివేసింది అక్కినేని కోడలు. ఇక శోభిత విషయానికి వస్తే.. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె, బాలీవుడ్ నటిగానే పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో గూడచారి వంటి చిత్రాలలో చేసింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే నాగచైతన్యతో ప్రేమలో పడిందని వార్తలు వినిపించాయో అప్పటినుంచి ఈమె భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక నాగచైతన్యను ప్రేమించడం, అతడిని పెళ్లి చేసుకోవడంతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది శోభితా ధూళిపాల. వివాహం తర్వాత కొన్ని సినిమాలకు వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈమె మునుపటి లాగానే తన సినిమాలలో బోల్డ్ ప్రదర్శన ఇస్తుందా లేక పద్ధతి అయిన పాత్రలో నటిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. మరొకవైపు నాగచైతన్య.. తండేల్ సినిమా సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న నాగచైతన్య మరో సినిమా ప్రకటించలేదు. ఇక త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ALSO READ:Rajinikanth Coolie: ఆసియాలోనే భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న సూపర్ స్టార్.. ఎన్ని కోట్లంటే?