BigTV English

Bachhalamalli Teaser Glimse: హె.. ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న బర్త్ డే గ్లింప్స్

Bachhalamalli Teaser Glimse: హె.. ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న బర్త్ డే గ్లింప్స్

Bachhalamalli Teaser Glimse: అల్లరి నరేష్ ఒక మంచి హిట్ కోసం పోరాటం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. గతేడాది ఒకటి రెండు సినిమాలతో వచ్చాడు. కానీ అవేమి పెద్దగా హిట్ కాలేదు. బాక్సాఫీసు వద్ద ఫ్లాప్‌గానే నిలిచాయి. దీంతో ఈ ఏడాది అయినా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. అదే తరుణంలో ఈ ఏడాది మొదట్లో నాగార్జున నటించిన ‘నా సామిరంగ్’ మూవీలో నటించాడు.


ఈ మూవీ సంక్రాంతి సమయంలో రిలీజ్ అయి పర్వాలేదనిపించుకుంది. అయితే ఈ సినిమా తర్వాత నరేష్ హీరోగా ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా చేశాడు. ఈ మూవీలో యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించింది. ఇక నరేష్‌కు ఈ సినిమా మంచి కంబ్యాక్ ఇస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా అందరినీ నిరాశ పరచింది. ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల్ని పెద్దగా అలరించలేకపోయింది.

దీంతో అతి కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఇక అక్కడ కూడా ఓటీటీ ఆడియన్స్ నుంచి పర్వాలేదనిపించుకుంది. కొత్త కొత్త కథలతో ఎన్ని సినిమాలు ట్రై చేస్తున్నా ఒక్క హిట్టు కూడా పడకుంటుంది. అయినా నరేష్ తన ఆత్మస్థైర్యాన్ని చంపుకోలేదు. విజయపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ‘బచ్చల మల్లి’ అనే భారీ మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు.


Also Read: అల్లరి నరేష్ మరో కొత్త అవతారం.. ఈసారి మోత మోగిపోవాల్సిందే..!

సుబ్బు మంగదెవ్వి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, ఫస్ట్‌లుక్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చాయి. అయితే ఇవాళ అల్లరి నరేష్ బర్త్ డే కావడంతో ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్‌ను మేకర్స్ అందించారు. ఈ మేరకు ఈ మూవీ టీజర్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.

ఈ టీజర్ గ్లింప్స్‌లో అల్లరి నరేష్‌ లుక్‌ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఊరమాస్ స్టైల్‌ చూసి నివ్వెరపోతున్నారు. ఇలాంటి లుక్‌లో అల్లరి నరేష్‌ని ఇంతక ముందెన్నడూ చూడలేదని చెబుతున్నారు. ఇక ఈ గ్లింప్స్‌లో ‘‘హె.. ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి’’ అనే డైలాగ్ మాత్రం సినీ ప్రియుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం ఈ టీజర్ గ్లింప్స్‌కి యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×