BigTV English

Vijay Devarakonda: ఇప్పటినుండి అన్నా అని పిలుస్తా, ఇది నువ్వు ఫిక్స్ అయిపో.. సైమా స్టేజ్‌పై నాని, విజయ్

Vijay Devarakonda: ఇప్పటినుండి అన్నా అని పిలుస్తా, ఇది నువ్వు ఫిక్స్ అయిపో.. సైమా స్టేజ్‌పై నాని, విజయ్

Vijay Devarakonda And Nani At SIIMA: ఇటీవల దుబాయ్‌లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) చాలా గ్రాండ్‌గా జరిగాయి. షూటింగ్స్‌లో బిజీగా ఉన్నా కూడా చాలామంది సౌత్ నటీనటులు ఈ ఈవెంట్ కోసం తరలివచ్చారు. నేచురల్ స్టార్ నాని సినిమాలు ఇటీవల ఫిల్మ్‌ఫేర్ వద్ద అవార్డుల పంట పండించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సైమా వంతు. సైమాలో కూడా నాని సినిమాలే సత్తా చాటుకున్నాయి. అంతే కాకుండా ఉత్తమ నటుడిగా కూడా అవార్డ్ అందుకున్నాడు నాని. తనకు ఉత్తమ నటుడిగా అవార్డ్ అందించడం కోసం విజయ్ దేవరకొండ స్టేజ్‌పైకి వచ్చాడు. సైమా స్టేజ్‌పై వారిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఆడిషన్ జ్ఞాపకాలు

నాని, విజయ్ దేవరకొండ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో కలిసి నటించారు. ఇందులో విజయ్ ఉండేది కాసేపే అయినా తన కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రాల్లో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ కూడా కచ్చితంగా ఉంటుంది. తాజాగా సైమా స్టేజ్‌పై కలిసిన నాని, విజయ్.. ఆ మూవీ విశేషాలను గుర్తుచేసుకున్నారు. ‘‘ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో మొదటిసారి నాకు కీలక పాత్ర పోషించడానికి ఛాన్స్ వచ్చింది. ఆ మూవీకి ఆడిషన్ చేయడానికి నాని ఆఫీస్‌కే వెళ్లాను. తనతో ఆడిషన్ అని తెలియగానే చాలా సంతోషంగా అనిపించింది. సంతోషంతో పాటు కంగారుగా కూడా అనిపించింది’’ అంటూ ఆడిషన్ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు విజయ్ దేవరకొండ.


Also Read: స్పిరిట్ మూవీపై వైరల్ అవుతున్న ఎన్టీఆర్ కామెంట్స్

అలాగే పిలుస్తా

‘‘ఏ యాక్టర్‌కు అయినా మొదటి సినిమా చాలా స్పెషల్‌గా ఉంటుంది. దానికి సంబంధించి ఎన్నో జ్ఞాపకాలు కూడా ఉంటాయి. ఎవడే సుబ్రహ్మణ్యం సమయంలో నాని నాకు చాలా సపోర్ట్‌గా ఉన్నాడు. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను నాని. ఇప్పటికీ నీపైన చాలా గౌరవం, ప్రేమ ఉన్నాయి. నేను కారణం లేకపోయినా ఇండస్ట్రీలో అందరినీ అన్నా అని పిలుస్తుంటాను. ఇప్పటినుండి నానిని కూడా అన్నా అని పిలవాలని డిసైడ్ అయ్యాను. నువ్వు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవడం చాలా సంతోషం. ఇలా నీకు అవార్డ్ అందించడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది’’ అని స్టేజ్‌పైనే నానిపై ఉన్న ప్రేమను బయటపెట్టాడు విజయ్.

అప్పటినుండే ఫ్రెండ్స్

విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు నాని స్టేజ్‌పైనే స్పందించాడు. ‘‘విజయ్ చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ టైమ్‌లో మేమిద్దరం సినిమాల గురించే చాలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. తను ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలని తపనతో ఉండేవాడు. వచ్చే ఏడాది ఇదే స్టేజ్‌పై గౌతమ్ తిన్ననూరి సినిమాకు నేను నీకు అవార్డ్ ఇస్తాను విజయ్. ఇది నువ్వు ఫిక్స్ అయిపో’’ అని నమ్మకంతో చెప్పాడు నాని. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అప్పటినుండి నాని, విజయ్‌కు మధ్య మంచి బాండింగ్ ఉంది. ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నా ఈవెంట్స్‌లో కలిసినప్పుడు మాత్రం ఆప్యాయంగా పలకరించుకుంటారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×