BigTV English

Nabha Natesh: ఆఫర్లు లేక అందుకు సై అన్న ఇస్మార్ట్ బ్యూటీ.. ఫస్ట్ ఛాన్స్ అతనికే!?

Nabha Natesh: ఆఫర్లు లేక అందుకు సై అన్న ఇస్మార్ట్ బ్యూటీ.. ఫస్ట్ ఛాన్స్ అతనికే!?

Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ గురించి తెలిసింది. చదువుతో పాటు మోడలింగ్ మరియు నాటకాల్లో పాల్గొనడం ద్వారా తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టింది.నభా నటేష్ తన సినీ కెరీర్‌ను 2015లో కన్నడ చిత్రం వజ్రకాయ సినిమాతో ప్రారంభించింది. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ సరసన నటించిన ఆమె, తొలి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. వజ్రకాయ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 2018లో తెలుగు సినిమా ‘నన్ను దోచుకుందువటే’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. సుధీర్ బాబు సరసన నటించిన ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఆమె అల్లరి పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది, మరియు ఆమె తెలుగు భాషను త్వరగా నేర్చుకుని స్వయంగా డబ్బింగ్ చెప్పడం కూడా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్‌తో బంపర్ బ్రేక్ అందుకుంది.


ఇస్మార్ట్ బ్రేక్!

నభా నటేష్‌కు బ్రేక్ ఇచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్ (iSmart Shankar). 2019లో వచ్చిన “ఇస్మార్ట్ శంకర్” చిత్రంతో వచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని సరసన నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర “ఇస్మార్ట్ బ్యూటీ” అనే బిరుదును తెచ్చిపెట్టింది. ఈ విజయంతో ఆమె తెలుగు సినీ పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఆ తర్వాత రవితేజ “డిస్కో రాజా”, “సోలో బ్రతుకే సో బెటర్”, “అల్లుడు అదుర్స్”, “మాస్ట్రో” వంటి చిత్రాల్లో నటించింది. అయితే, ఈ సినిమాలు అమ్మడిని ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇక 2022లో ఆమె రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. కోలుకున్న తర్వాత గతేడాది “డార్లింగ్” అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతానికి అమ్మడి చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు. కానీ తన అందాలతో సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తునే ఉంది. ఇక ఇప్పుడు అందా ఆరబోతకు సిద్ధమైంది. ఐటెం సాంగ్‌లో చిందేయడానికి రెడీ అయినట్టుగా తెలిసింది.


‘జాట్‌’సినిమాలో ఐటెం సాంగ్?

ఐటెం బ్యూటీగా యూ టర్న్ తీసుకున్న నభా నటేష్.. ఫస్ట్ ఛాన్స్ బాలీవుడ్ హీరోతో అందుకుంది. స‌న్ని డియోల్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో ‘జాట్'(Jaat) అనే యాక్ష‌న్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్- పీపూల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ‌లు నిర్మిస్తున్నాయి. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం న‌భా న‌టేష్‌ ఓకె అయినట్టుగా టాక్. ప్రస్తుతం ఈ పాటను హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేకంగా వేసిన భారీ సెట్‌లో చిత్రీకరిస్తున్నట్టు స‌మాచారం. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ వారు పుష్ప సినిమాలో సమంత, రాబిన్ హుబ్ సినిమాలో కేతిక శర్మను ఐటెం బ్యూటీలుగా మార్చేశారు. ఇప్పుడు నభా నటేష్‌ను రంగంలోకి దింపుతున్నారు. మరి హీరోయిన్‌గా ఛాన్సులు లేక ఉన్న ఈ హాట్ బ్యూటీకి.. ఈ ఐటెం సాంగ్ ఎలాంటి అవ‌కాశాలు తెచ్చిపెడుతుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×