Shruti Haasan..శృతిహాసన్ (Shruti Haasan).. విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) కూతురిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. తండ్రి ఇమేజ్ ను ఉపయోగించుకోకుండానే నేడు స్టార్ హీరోయిన్గా చలామణి అవుతోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో సింగర్ గా, నటిగా, తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకున్న ఈమె.. సింగర్ గా సక్సెస్ అయింది. కానీ హీరోయిన్గా ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది. ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా డిజాస్టర్ గా మిగలడంతో కొద్దిరోజులు ఇండస్ట్రీకి కూడా దూరం అయింది. కానీ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత అవకాశాలు వరుసగా వచ్చిపడ్డాయి.
రజినీకాంత్ పై ప్రశంసలు కురిపించిన శృతిహాసన్..
ఇక ఆ తర్వాత మళ్లీ కొంతకాలం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన ఈమె ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘సలార్’ సినిమాలో నటించి ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఇక ఇప్పుడు వరుసగా కోలీవుడ్ సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న ఈమె తాజాగా రజనీకాంత్ (Rajinikanth ) హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో అవకాశాన్ని అందుకుంది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న శృతిహాసన్.. తాజాగా ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీకాంత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంపై మాట్లాడింది. అదే సమయంలో తన తండ్రి కమలహాసన్ పేరు ప్రస్తావించకుండా రజినీకాంత్ గొప్పవాడు అని చెప్పడంతో కమలహాసన్ అభిమానులు హర్ట్ అవుతున్నారు. మీ తండ్రి విశ్వ నటుడు ఆయన గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు ఏంటి? అంటూ ఆమెపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
రజనీకాంత్ నుంచీ స్ఫూర్తి పొందాను – శృతిహాసన్
ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతిహాసన్ మాట్లాడుతూ.. “రజనీకాంత్ తో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంత పెద్ద స్టార్ గా ఆయన ఎలా ఎదిగారో.. ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడే అర్థమయ్యింది. సినిమా పట్ల అంకిత భావం, క్రమశిక్షణ, పాత్ర కోసం కష్టపడే తత్వం ఇలా ఎన్నో విషయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. వినయంగా ఉంటారు. సెట్లో ఎప్పుడూ కూడా చాలా ఎనర్జిటిక్గా పనిచేస్తారు. ఈ వయసులో కూడా అంత కాన్ఫిడెంట్గా ఉండడమే కాకుండా అంత పాజిటివిటీ ఆయనలో ఎలా ఉందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అలాగే వ్యక్తిగా కూడా ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా ఇతరులతో ఎలా వ్యవహరించాలో రజనీకాంత్ ని చూసే నేను తెలుసుకున్నాను” అంటూ రజనీకాంత్ పై ప్రశంసలు కురిపించింది శృతిహాసన్.
ALSO READ; Prabhas: త్వరలో ప్రభాస్ పెళ్లి.. టీమ్ రియాక్షన్ అదుర్స్..!
రజనీకాంత్ గొప్పతనం.. శృతిహాసన్ పై ట్రోల్స్..
శృతిహాసన్ రజినీకాంత్ గొప్పతనం గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, సినిమా కోసం ఆయన పడే కష్టం గురించి వెల్లడించడంతో కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఇదే అదునుగా తీసుకొని శృతిహాసన్ పై కామెంట్లు చేస్తున్నారు. అంత పెద్ద ఇంటర్వ్యూలో నీకు జన్మనిచ్చిన తండ్రి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏంటి అంటూ ఆమెపై కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది తండ్రిని కాదని రజనీకాంత్ పై ప్రశంసలు కురిపించడంతో ఈమెపై ట్రోల్స్ గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా ఉన్నది ఉన్నట్టు చెప్పి ఎరక్కపోయి ఇరుక్కుపోయింది ఈ ముద్దుగుమ్మ అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో తనది చాలా సింపుల్ పాత్ర అయినా అందరికీ కనెక్ట్ అవుతుందని, లోకేష్ దర్శకత్వంలో పనిచేయడం తన కల అని, అందుకే ఈ సినిమా ద్వారా తన కలను నెరవేర్చుకున్నాను అంటూ కూడా తెలిపింది శృతిహాసన్.