Raja Saab Movie: పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్స్ వచ్చిన తర్వాత దర్శకుల విషయంలో హీరోలు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలా లేకపోతే ఫ్లాపులు ఎదురవ్వక తప్పదు. దానికి ఉదాహరణ ప్రభాసే. పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్.. స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో కొన్ని పొరపాట్లు చేశాడు. దాని వల్ల తనను కొన్నాళ్ల వరకు ఫ్లాప్స్ వెంటాడాయి. అదే సమయంలో తన తరువాతి సినిమా దర్శకుడు మారుతీతో అనగానే ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అయ్యారు. కానీ మారుతీ మాత్రం ‘రాజా సాబ్’తో ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఫీస్ట్ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. అసలైతే సమ్మర్‌లో విడుదల కావాల్సిన ఈ మూవీ మరోసారి పోస్ట్‌పోన్ కాగా దీనిపై దర్శకుడు మారుతీ స్పందించాడు.
రాజా సాబ్ అప్డేట్
దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుండి చాలావరకు యంగ్ హీరోలతోనే సినిమాలు చేశాడు మారుతీ (Maruthi). అందుకే ప్రభాస్ (Prabhas) లాంటి పాన్ ఇండియా స్టార్‌ను తను హ్యాండిల్ చేయగలడా, అసలు ప్రభాస్ తనకు ఎందుకు అవకాశం ఇచ్చాడు అంటూ వీరి కాంబోపై చాలా ట్రోల్ చేశారు ప్రేక్షకులు. కానీ ఒకేఒక్క గ్లింప్స్‌తో అందరి నోళ్లు మూయించాడు మారుతీ. చాలాకాలం తర్వాత కూల్ లుక్స్‌తో ఉన్న ప్రభాస్ గ్లింప్స్‌ను వదిలి అందరినీ హ్యాపీ చేశాడు. ఆపై ముసలివాడి గెటప్‌లో ఉన్న ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ తర్వాత అందరూ ‘రాజా సాబ్’ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఇక తాజాగా ఒక మూవీ ఈవెంట్‌కు హాజరయిన దర్శకుడు మారుతీ ‘రాజా సాబ్’ గురించి ప్రేక్షకులకు అప్డేట్ అందించాడు.
ప్రెజర్ ఉండొద్దు
‘‘రాజా సాబ్ లాంటి సినిమాను నా నుండి ప్రేక్షకులు ఆశిస్తారు. నా సినిమాలో ఏయే అంశాలు ఉంటాయో వాటన్నింటితో కలిపి ఈ సినిమా తీసేలా ప్రభాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభాస్ లాంటి స్టార్ ఈ సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి ప్రెజర్ లేకుండా ఉంటే సినిమా చాలా బాగా వస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు మారుతీ. అంటే ‘రాజా సాబ్’ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ నుండి తాను ప్రెజర్ ఫీలవుతున్నానని చెప్పకనే చెప్పాడు ఈ దర్శకుడు. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ అవుతూ ఉండడంతో మారుతీపై ప్రెజర్ ఆటోమేటిక్‌గా పెరిగిపోయింది.
Also Read: తెరపైకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ బయోపిక్.? హీరో ఎవరో తెలుసా.?
అదే స్టోరీ
ఇప్పటికే ‘రాజా సాబ్’ (Raja Saab)కు సంబంధించిన ఫుల్ స్టోరీ లీక్ అయ్యింది. ఒక థియేటర్ కోసం తాత, మనవళ్ల మధ్య జరిగే కథ ఇది అని చాలాకాలం నుండే ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో తాతగా మాత్రమే కాకుండా మనవడిగా కూడా ప్రభాస్ డ్యూయెల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ డ్యూయెల్ రోల్స్‌కు సంబంధించిన రెండు ఫస్ట్ లుక్స్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇక ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ నటిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండడంతో మూవీ మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది.