BigTV English

Pro Kabaddi Semi Finals: నేడే సెమీస్.. చివరి అంకానికి ప్రో కబడ్డీ..

Pro Kabaddi Semi Finals: నేడే సెమీస్.. చివరి అంకానికి ప్రో కబడ్డీ..

Pro Kabaddi Season-10 SemifinalsPro Kabaddi Season-10 Semifinals: ప్రో కబడ్డీ సీజన్-10 ఆఖరి అంకానికి చేరుకుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రొ కబడ్డీ సెమీఫైనల్ మ్యాచులు జరగనున్నాయి.


తొలి మ్యాచ్‌లో పుణేరి పల్టాన్, పట్నా పైరేట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ బుధవారం రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. ఇక రెండో సెమీస్‌లో జైపూర్ పింక్ పాంథర్స్, హర్యానా స్టీలర్స్ తలపడనున్నాయి. కాగా ఈ మ్యాచ్ బుధవారం రాత్రి 9 గంటలకు జరుగుతుంది.

ఈ రెండు మ్యచుల్లో గెలిచిన జట్లు మార్చి 1 న జరిగే ఫైనల్లో తలపడతాయి. ఫైనల్ కూడా గచ్చిబౌలి స్టేడియంలోనే జరగనుంది.


96 పాయింట్లతో పుణేరి పల్టాన్, 92 పాయింట్లతో జైపూర్ పింక్ పాంథర్స్ నేరుగా సెమీస్‌కి చేరుకున్నాయి. ఇక ప్లే ఆఫ్స్‌లో దబాంగ్ ఢిల్లీ, పట్నా పైరేట్స్ తలపడగా పట్నా 37-35 తో ఢిల్లీపై విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. ఇక మరో ప్లే ఆఫ్ మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 42-25 తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసి సెమీస్‌కి చేరింది.

Read More: జిమ్‌లో పంత్ కసరత్తులు.. ఐపీఎల్ కోసం తీవ్రంగా శ్రమిస్తోన్న కీపర్..

ఇక ఎప్పటిలాగే తెలుగు టైటాన్స్ ఈ సీజన్‌లో కూడా నిరాశపరిచింది. 22 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ రెండింట్లో విజయం సాధించి 19 మ్యాచ్‌ల్లో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక చివరి లీగ్ మ్యాచ్‌లో యూ ముంబాతో తలపడిన టైటాన్స్.. మ్యాచ్‌ను డ్రా గా ముగించింది.

కాగా సీజన్ 9లో కూడా తెలుగు టైటాన్స్ చివరి స్ధానంలో నిలిచింది.

Tags

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×