BigTV English
Advertisement

Actress Raga Madhuri : కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్స్ అన్నారు… సీనియర్ నటికి చేదు అనుభవం

Actress Raga Madhuri : కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్స్ అన్నారు… సీనియర్ నటికి చేదు అనుభవం

Actress Raga Madhuri : 20 ఏళ్ల క్రితం యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి, ఇప్పుడు నెంబర్ వన్ ఆర్టిస్ట్ గా సీరియల్స్ లో చాలా బిజీగా ఉన్న నటి రాగ మాధురి (Raga Madhuri). ‘మొగలి రేకులు’ సీరియల్ తో పాపులర్ అయిన ఆవిడ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆమె క్యాస్టింగ్ కౌచ్ తో పాటు సీరియల్ ఆర్టిస్ట్ లకు ఎదురయ్యే కష్టాలను బయట పెట్టారు.


భర్తకు హ్యాండ్ ఇచ్చిన రాగ మాధురి

ఇంటర్వ్యూలో రాగ మాధురి మాట్లాడుతూ ఇంట్లో తన పెళ్లికి ఒప్పుకోకపోవడంతో, పట్టుదలతో బయటకు వచ్చి ఇంట్లో సామాన్లు సైతం తామే కొనుక్కున్నామని వెల్లడించింది. అంతేకాకుండా తన భర్తతో “నువ్వు సక్సెస్ అయ్యేదాకా ఇద్దరం జాబ్ చేద్దాం’ అని డీల్ కుదుర్చుకున్నారట. “కానీ చివరికి ఆయన సక్సెస్ అయ్యాక కూడా నేను హ్యాండ్ ఇచ్చాను” అంటూ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది రాగమాధురి.


కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్సులు

యువర్స్ లవింగ్లీ, ఆట కావాలా పాట కావాలా వంటి సక్సెస్ ఫుల్ షోస్ చేశాక సినిమాల వైపు వెళ్లకుండా ఎందుకు సీరియల్స్ వైపు వెళ్లారు ? అనే ప్రశ్నకి “ఒకసారి సీరియల్ ఒప్పుకున్నాక సినిమాలో ఛాన్స్ ఉందని చెప్పారు. అచ్చం తెలుగు అమ్మాయిలా ఉన్నారు. మీరు ఆడిషన్ ఇవ్వక్కర్లేదు అని చెప్పారు. కాల్ కట్ అయ్యాక కాసేపటికి మళ్లీ కాల్ చేశారు. నేను సాయిబాబా గుడి దగ్గర నుంచి మా ఇంటికి వెళ్తున్నాను. టూ వీలర్ మీద వెళ్తూ కరెక్ట్ గా గుడి ముందర ఆపాను. మేడం ఒకటి చెప్పడం మర్చిపోయాను. కమిట్మెంట్ ఒకటి ఉంటుంది అన్నారు. కానీ నిజంగా నాకు అసలు ఆ పదం ఏంటో అప్పటికి తెలియదు.

చిన్నప్పుడు మనం చదువుకున్న దాని ప్రకారం కమిట్మెంట్ అంటే వర్క్ పట్ల డెడికేషన్ అని తెలుసు. అవతలి వ్యక్తి మాట అసలు వినిపించుకోకుండా… లేదండి, నేను చాలా పంక్చువల్. మీరు నా యాంకరింగ్ హిస్టరీని కూడా చూడొచ్చు. నేను ఒక్కరోజులో రెండు మూడు ఛానల్స్ కి 8 ప్రోగ్రామ్స్ అలా చేశాను. అవార్డు కూడా వచ్చింది అని ఆగకుండా చెబుతూనే ఉన్నాను. దీంతో అతను అమ్మ ఒక్క నిమిషం అని ఆపి, మీకు అర్థమైంది వేరే కానీ ఇక్కడ కమిట్మెంట్ అంటే వేరే అర్థం ఉంటుంది అని చెప్పాడు.

అంటే ఒప్పుకున్న తర్వాత వేరే దగ్గరికి వెళ్తానేమో అని మీరు అంటున్నారా ? అని అడిగాను. లేదు లేదు… మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి కమిట్మెంట్ అని ఎప్పుడైనా విన్నారా? ఇక్కడ అలాంటి ఇబ్బంది అయితే ఉంటుంది. అన్నీ కాంప్రమైజ్ కావాల్సి వస్తుందని చెప్పాడు. అయితే డైరెక్ట్ గా చెప్పలేదు కానీ, అది అర్థం చేసుకొని తేరుకోవడానికి ఒక రెండు నిమిషాలు పట్టింది. చాలా భయం వేసింది. ఆ వర్డ్ వినగానే మిట్ట మధ్యాహ్నం ఒంటరిగా ఫీల్ అయ్యాను. అలాంటి ఇబ్బందేమీ లేదు అంటేనే షూటింగ్ కు వస్తాను అని చెప్పాను. లేదంటే లేదని అన్నాను. ఆ తర్వాత వాళ్లు కాల్ చేయలేదు. కానీ నా కాలిని నేను ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వెనక్కి తీసుకున్నాను” అంటూ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×