Devara 2 Update:దేవర -2 (Devara-2) గురించి ఇప్పటికే సినీ వర్గాలలో సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దేవర 2 రావడం వేస్ట్ అని, దేవర -1 బాలేదు. ఇంకా పార్ట్ 2 లో ఏం చూపిస్తారు.. సినిమాకి బడ్జెట్ బొక్కా.. టైం వేస్ట్ అంటూ ఇలా ఎంతోమంది దేవర-2 పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే దేవర-1(Devara-1) పై చాలామంది నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ వారి అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేకపోవడంతో పార్ట్ 2పై వీరికి అంతగా నమ్మకం లేదు. కానీ అసలు కథ మొత్తం పార్ట్ 2 లోనే ఉంది అని, ఈ సినిమాకి సంబంధించిన నటీనటులు అంటున్నారు. అయితే పార్ట్ 1 లోనే కథ లేదు పార్ట్ 2 తీసి ఏం చేస్తారు అని అసహనం వ్యక్తం చేశారు. అంతే కాదు సోషల్ మీడియాలో దేవర(Devara) సినిమాపై మాత్రం ట్రోల్స్ మామూలుగా పేలలేదు. ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో అక్కడక్కడ దేవర మూవీకి సంబంధించి ట్రోల్స్ పేలుతోనే ఉంటాయి. అయితే అలాంటి దేవర-2 పోస్ట్ పోన్ అయిందని,ఈ సినిమా తెరకెక్కించే ఆలోచన కొరటాల శివకు లేదు అని ఆ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి. కానీ అదంతా అబద్ధం అని కొరటాల శివ(Koratala Siva) ప్రస్తుతం దేవర 2 కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ రెడీ చేస్తున్నారని సినీ వర్గాల్లోని కొంతమంది హింట్స్ ఇచ్చారు.
దేవర 2 పై అప్డేట్ ఇచ్చిన రామేశ్వరి..
అంతేకాదు పుష్ప -2 (Pushpa-2 ) లో ఎలా అయితే యాక్షన్ సన్నివేశాలను యాడ్ చేసి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారో, దేవర 2 లో కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా దేవర 2 మూవీ పై అప్డేట్ ఇచ్చింది నటి రామేశ్వరి (Rameshwary) .. నటి రామేశ్వరి పేరు చెబితే తెలియకపోవచ్చు. కానీ మహేష్ బాబు(Mahesh Babu)హీరోగా చేసిన నిజం మూవీ(Nijam Movie) లో మహేష్ తల్లి పాత్రలో నటించింది అంటే అందరికీ ఇట్టే గుర్తుకొస్తుంది. అయితే అలాంటి రామేశ్వరి దేవర సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే దేవర-1 లో తన పాత్రకి అంతగా ప్రాధాన్యత లేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామేశ్వరి దేవర-2 గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.దేవర-1 లో నా పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. కానీ దేవర 2(Devara-2) లో మాత్రం నా పాత్రకి ప్రాధాన్యత ఉంటుందని కొరటాల శివ చెప్పారు. దేవర -2లో నాకు మంచి మంచి సన్నివేశాలు ఉంటాయని కొరటాల శివ నాతో చెప్పారు..ఇక పార్ట్ 1 లో నాకు అంతగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ కొరటాల శివ (Koratala Siva) మాత్రం నన్ను గౌరవంగానే చూశారు.. అంటూ రామేశ్వరి చెప్పుకొచ్చింది.
వచ్చే యేడాది దేవర 2 షూటింగ్ ప్రారంభం..
అలాగే దేవర పార్ట్ 2 షూటింగ్ ఇప్పట్లో ఉండదని కూడా తేల్చేసింది. ఇక దేవర-2 వచ్చే ఏడాది స్టార్ట్ అవబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది ఎన్టీఆర్(NTR) ప్రశాంత్ నీల్ సినిమాతో పాటు వార్-2(War-2)లో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ లో వార్ -2 షూటింగ్ ముగియడంతోనే ప్రశాంత్ నీల్ సినిమాలో పాల్గొంటారు. ఆ సినిమా పూర్తయ్యాకే దేవర 2 చేస్తానని ఎన్టీఆర్ చెప్పడంతో కొరటాల శివ అప్పటివరకు వెయిట్ చేస్తారని తెలుస్తోంది.