Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే గత రెండేళ్లుగా వరుస ప్లాప్స్ తో కనీసం కంటికి కూడా కనిపించకుండా తిరిగిన ఈ చిన్నది.. ఈ ఏడాది వరుస సినిమాలను లైన్లో పెట్టింది. ఈ మధ్యనే బాలీవుడ్ లో దేవా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాలో అమ్మడు మంచి ఘాటు లిప్ కిస్ ఇచ్చి ట్రోల్ అయ్యింది. మునుపెన్నడూ లేనివిధంగా బాలీవుడ్ లో అవకాశాల కోసం పూజా.. ఇలా లిప్ కిస్ లు ఇస్తుందని నెటిజన్స్ కోడై కూస్తున్నారు. ఈ సినిమా ఒక మోస్తరుగా ఆడుతుంది.
ఇక ఇది కాకుండా తమిళ్ లో సూర్య సరసన రెట్రో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నిజం చెప్పాలంటే ఈ సినిమా పూజకు ఒక లక్కీ ఛాన్స్ అని చెప్పాలి. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అమ్మడు చాలా కష్టపడుతుంది. ఇక తాజాగా రెట్రోలో పూజాకు అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా విజయ్ తో మరోసారి నటించడంపై కూడా స్పందించింది.
” రెట్రోలో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ఈ రోల్ నాకు దక్కడానికి కారణం రాధేశ్యామ్. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు.. రాధేశ్యామ్ సినిమా చూసి అందులో నా ఎమోషన్ సీన్స్ చూసి నన్ను ఓకే చేశారు. రెట్రోలో కూడా చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక పూజా వ్యాఖ్యలపై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
World Cancer Day: క్యాన్సర్ ను జయించిన సెలబ్రిటీలు.. వామ్మో ఇంతమంది స్టార్ హీరోయిన్సా.. ?
గతంలో అమ్మడి ఎమోషనల్ సీన్స్ ను ట్రోలర్స్ బాగా ట్రోల్ చేశారు. ముఖ్యంగా ఆమె ఏడుస్తుంటే మరీ దారుణంగా ఉందని, హీరోయిన్ గా ఈమెను ఎలా తీసుకున్నారు అంటూ ట్రోల్ చేశారు. చివరకు అసలు ఆ ఏడుపు ఏంట్రా బాబు.. అస్సలు చూడలేకపోతున్నాం అంటూ మీమ్స్ కూడా వేశారు. అలాంటిది ఆ ఎమోషనల్ సీన్స్ చూసి కార్తీక్ సుబ్బరాజు ఎలా హీరోయిన్ గా తీసుకున్నాడు అంటూ ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు. పూజా ఏడుపులో నీకేం నచ్చింది అన్నా అని కొందరు.. నీ ఏడుపే ఒక ట్రోల్ అయ్యింది.. దాన్ని చూసి ఛాన్స్ వచ్చిందా.. ? అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.
ఇక విజయ్ తో కలిసి జన నాయకుడు సినిమాలో నటించడంపై పూజా మాట్లాడుతూ.. ” జన నాయకుడు చిత్రంలో నేను భాగం కావడం నాకు ఆనందంగా ఉంది. విజయ్ చివరి చిత్రం అనగానే ఏమి ఆలోచించలేక. వెంటనే ఒప్పుకున్నాను” అని చెప్పుకొచ్చింది. ఇప్పటికే విజయ్, పూజా కలిసి బీస్ట్ సినిమాలో నటించారు. ఈ సినిమా పరాజయాన్ని అందుకుంది. ఈ సినిమాప్లాప్ అవ్వడానికి కారణం కూడా పూజా ఐరెన్ లెగ్ అని కూడా చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమాలతో అమ్మడు కమ్ బ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి.