Rashmika Mandanna as a Heroine in Siva Karthikeyan Movie: నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకున్న నటీమణులలో ఈమె ఒకరు. ‘ఛలో’ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ బ్యూటీ. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల ఆఫర్లు కొట్టేసింది. అదే టైంలో తెలుగుతో పాటు, తమిళ్, కన్నడ వంటి భాషల్లోనూ నటించి అదరగొట్టింది.
అలా స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక తన కెరీర్‌ని మరో ఎత్తుకి మలుపు తిప్పిన సినిమా ఏదన్నా ఉందంటే అది ‘పుష్ప’ సినిమా మాత్రమే. సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాలో రష్మిక తన నటన, అందంతో అదరగొట్టేసింది. ఈ మూవీతో నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందింది. ఇందులో శ్రీవల్లి పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ అందరి మన్ననలు పొందింది.
ఈ మూవీతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. దీంతో తన తదుపరి సినిమాలన్నీ భారీ స్థాయిలో ఉండేట్టుగా చూసుకుంటోంది. ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామ గతేడాది బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ స్టార్ హీరో రణబీర్ కపూర్‌కి జోడీగా ‘యానిమల్’ మూవీలో నటించింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది.
Also Read: రష్మిక మందన్న మరో డీప్‌ఫేక్ వీడియో.. ఈ సారి మరింత దారుణంగా..!
ఇలా భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె లైనప్‌లో చాలా సినిమాలే ఉన్నాయి. అందులో అల్లు అర్జున్ ‘పుష్ప2’లో నటిస్తుంది. ఈ మూవీ నుంచి ఇటీవలే తన కొత్త లుక్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీతో పాటు మరో మూవీలో కూడా నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ – టాలీవుడ్ హీరో నాగార్జున కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ‘కుబేర’లో కూడా నటిస్తుంది. ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలతో బిజీ బిజీగా ఉంది. అంతేకాకుండా బాలీవుడ్‌లో కూడా క్రేజీ ఆఫర్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ అమ్మడు మరో ఛాన్స్ అందుకుంది. తమిళ స్టార్ హీరోతో జోడీ కట్టేసింది. అయితే అతడు మరెవరో కాదు.. తమిళ హీరో శివ కార్తికేయన్. శిబిచక్రవర్తి దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుందని దర్శకుడు తాజాగా తెలిపాడు. అంతేగాక ఈ మూవీలోని పాత్రకు రష్మక అయితేనే చాలా బాగుంటుందని.. అందుకే ఆమెను కలిసినట్లు ఆయన చెప్పుకొచ్చాడు. దీంతో రష్మిక మరొక సినిమాను లైన్‌లో పెట్టుకుందని చెప్పుకోవచ్చు.